Lifestyle: పసుపును నేరుగా ముఖానికి అప్లై చేసుకుంటున్నారా.? ఈ సమస్యలు తప్పవు

పసుపును ముఖానికి రాసుకోవడం వల్ల మేలు జరుగుతుందని తెలిసిందే. అయితే అదే పసుపుక కొందరిలో సైడ్‌ ఎఫెక్ట్స్‌కు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పసుపును నేరుగా ముఖానికి అప్లై చేయడం వల్ల దుష్ప్రభావాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా డ్రై స్కిన్‌ ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లో పసుపును నేరుగా అప్లై చేయకూడదని..

Lifestyle: పసుపును నేరుగా ముఖానికి అప్లై చేసుకుంటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
Lifestyle

Updated on: Apr 29, 2024 | 8:29 PM

పసుపు ఇంట్లో కచ్చితంగా ఉండే నిత్యవసర వస్తువు. ప్రతీ ఒక్కట వంటకంలో ఉపయోగించే పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖానికి పసుపు అప్లై చేసుకుంటే ముఖం అందంగా మారుతుందని తెలిసిందే. అయితే మంచి చేసే పసుపు కొన్ని సందర్భాల్లో సమస్యలకు కూడా దారి తీస్తుందని మీకు తెలుసా.?

పసుపును ముఖానికి రాసుకోవడం వల్ల మేలు జరుగుతుందని తెలిసిందే. అయితే అదే పసుపుక కొందరిలో సైడ్‌ ఎఫెక్ట్స్‌కు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పసుపును నేరుగా ముఖానికి అప్లై చేయడం వల్ల దుష్ప్రభావాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా డ్రై స్కిన్‌ ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లో పసుపును నేరుగా అప్లై చేయకూడదని చెబుతున్నారు. ఇలా చేస్తే చర్మం చికాకు, దురద, ఎరుపెక్కడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

అలాగే మరికొందరిలో పసుపును నేరుగా ముఖంపై అప్లై చేయడం వల్ల ఎర్రటి మొటిమలు రావడం ప్రారంభమవుతాయని చెబుతున్నారు. దీన్ని నేరుగా ఉపయోగించడం వల్ల కొందరికి అలర్జీ రావచ్చని అంటున్నారు. అయితే పసుపును నేరుగా కాకుండా కొన్నింటిలో కలుపుకొని తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ పసుపు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పసుపును పాలలో లేదా పెరుగులో కలిపి పేస్ట్‌లా తయారు చేసుకొని అప్లై చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తయారు చేసుకున్న పేస్ట్‌ను ముఖానికి 20 నిమిషాలు అప్లై చేసి ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. అలాగే శనగపిండితో పాటు పసుపును కలిపి అప్లై చేసుకున్నా ఫలితం ఉంటుంది. పసుపు పొడితో పాటు గంధపు పొడికి కలిపి ముఖానికి అప్లై చేసుకుంటే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి..