Chicken: చికెన్ తినేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. ఇలా చేస్తే ఆరోగ్యం షెడ్డుకే

|

Mar 29, 2025 | 6:29 PM

నాన్ వెజ్ ప్రియులకు ప్రతీ రోజూ చికెన్ లేకపోతే ముద్ద దిగదు. అలా అని రోజూ చికెన్ తింటే ఆరోగ్యానికి మంచిదేనా.? అలాగే చికెన్ తినేటప్పుడు కచ్చితంగా ఈ తప్పులు చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.? మరి ఆ తప్పులు ఏంటి.?

Chicken: చికెన్ తినేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. ఇలా చేస్తే ఆరోగ్యం షెడ్డుకే
Chicken Curry
Follow us on

నాన్-వెజ్ ప్రియులకు చికెన్ లేదంటే అస్సలు ముద్ద దిగదు. మాంసాహారులకు ఎంతో ఇష్టమైన ఈ ఫుడ్‌లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే చికెన్ తినేటప్పుడు మాత్రం ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదని.. చేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చికెన్‌ను సరిగ్గా ఉడికించకుండా తినడం ఆరోగ్యానికి చాలా ముప్పు అని అంటున్నారు. బ్రాయిలర్ చికెన్‌లో సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు దారి తీయవచ్చు. అలాగే చికెన్ తిన్న వెంటనే పాలు, పెరుగు లేదా ఇతర పాల ఉత్పత్తులు అస్సలు తీసుకోకండి. చికెన్‌లో అధిక ప్రోటీన్ ఉంటుంది. అవి జీర్ణం కావడానికి సమయం పడుతుంది. పైగా పాల ఉత్పత్తులతో కలిపి తింటే అజీర్ణం, గ్యాస్ లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. ఈ రెండింటిని తినాలంటే కనీసం 1-2 గంటల గ్యాప్ ఉండటం మంచిది.

వారంలో ఒకట్రెండు సార్లు చికెన్ తినడం పెద్ద సమస్యేమి కాదు. కానీ ప్రతీ రోజూ చికెన్ తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. ఇది కీళ్ల నొప్పులు లేదా మూత్రపిండాల సమస్యలకు కారణం కావచ్చు. అటు చికెన్‌తో బంగాళదుంపలు కలిపి తినడం వల్ల జీర్ణశక్తి మందగించవచ్చు. ఇది అజీర్ణం లేదా అధిక బరువుకు దారితీస్తుంది. చికెన్‌తో కూరగాయలు లేదా తక్కువ కార్బ్స్ ఉన్న ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

చికెన్ తిన్న వెంటనే నిమ్మ, ద్రాక్ష వంటి ఆమ్లా పండ్లు తినడం మంచిది కాదు. ఇవి జీర్ణక్రియను ఆలస్యం చేసి, కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. చికెన్ తిన్న 30 నిమిషాల తర్వాతే పండ్లు తినడం మంచిది. మరోవైపు చికెన్ తాజాగా ఉన్నప్పుడే తినడం ఉత్తమం. రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేసిన చికెన్‌లో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. అలాంటి చికెన్ తినడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.