Weight Gain: వేగంగా భోజనం చేస్తే త్వరగా బరువు పెరుగుతారా? ఎలా అడ్డుకోవాలి..

కొంతమందికి పనుల ఒత్తిడిలో ఇంట్లో భోజనం తయారు చేసుకోవడానికి సమయం ఉండటం లేదు. ఈ మారిన జీవనశైలి కారణంగా చాలా మంది త్వరగా తినే అలవాటును పెంచుకున్నారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని, ఊబకాయం సమస్యను పెంచుతుందని..

Weight Gain: వేగంగా భోజనం చేస్తే త్వరగా బరువు పెరుగుతారా? ఎలా అడ్డుకోవాలి..
Causes Of Gaining Weight

Updated on: Apr 19, 2026 | 12:27 PM

నేటి వేగవంతమైన జీవనశైలిలో తినడానికి కూడా చాలా మందికి సమయం దొరకడం లేదు. పనుల ఒత్తిడిలో ఇంట్లో భోజనం తయారు చేసుకోవడానికి సమయం ఉండటం లేదు. ఈ మారిన జీవనశైలి కారణంగా చాలా మంది త్వరగా తినే అలవాటును పెంచుకున్నారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని, ఊబకాయం సమస్యను పెంచుతుందని నిపుణులు అంటున్నారు. వేగంగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీనిని నివారించడానికి ఏం చేయాలి? బదులుగా ఏయే ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవాలి? వంటి సమాచారం నిపుణుల మాటల్లో మీకోసం..

వేగంగా తింటే ఏమవుతుంది?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వేగంగా తిన్నప్పుడు కడుపు నిండిందనే సంకేతం శరీరానికి అందదు. దీనివల్ల అవసరానికి మించి ఆహారం ఎక్కువగా తీనేస్తాం. ఫలితంగా శరీర బరువు పెరిగి ఊబకాయంకి దారి తీస్తుంది. అంతేకాకుండా ఆహారాన్ని సరిగ్గా నమలకపోవడం వల్ల జీర్ణక్రియ కూడా మందగిస్తుంది. ఇది అజీర్ణం, కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. ఈ అలవాటు ఎక్కువ కాలం కొనసాగితే మీ జీవక్రియ మందగించి, మీ శరీరంలో కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది.

ఇతర ఆరోగ్య సమస్యలు

వేగంగా తినే వ్యక్తులు ఎక్కువ కేలరీలు తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. దీనికి తోడు ఇన్సులిన్ అసమతుల్యత టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. హార్మోన్ల అసమతుల్యత, అలసట కూడా పెరగవచ్చు.

ఇవి కూడా చదవండి

దీన్ని ఎలా నివారించాలి?

ఈ సమస్యను నివారించడానికి నెమ్మదిగా తినడం, భోజనాన్ని ఆస్వాదించడం చాలా ముఖ్యం. ఆహారాన్ని బాగా నమలాలి. టీవీ చూస్తూ లేదా మొబైల్ ఫోన్ చూస్తూ తినడం మానుకోవాలి. వీటన్నిటితో పాటు, భోజనాల మధ్య చిన్న విరామం తీసుకోవడం కూడా సహాయపడుతుంది. క్రమమైన సమయాల్లో తినడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, జంక్ ఫుడ్ తగ్గించడం వంటివి చేయాలి. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us