ఈ పండు మీ ఇంటి డాక్టర్‌.. రోజుకొక్కటి తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం!

18 April 2026

TV9 Telugu

TV9 Telugu

అరటిపండు అంటే ఇష్టముండ‌ని వారుండ‌రు.. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకూ అందరూ ఇష్టంగా తింటారు. ఈ పండు ఏడాది పొడువునా దొరుకుతుంది

TV9 Telugu

అన్ని సీజన్లలో ఈ పండ్లు మార్కెట్లో విరివిగా ల‌భిస్తాయి. అరటి పండు తియ్యని రుచి కలిగి ఉండ‌డ‌మేకాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది

TV9 Telugu

అరటిలో విటమిన్ సి, ప్రోటీన్, విటమిన్ బి6, పొటాషియం మరియు మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజుకు ఒక అరటిపండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి

TV9 Telugu

ప్రతిరోజూ ఒక అరటిపండు తినడం వల్ల ఇందులోని వివిధ పోషకాలు ప్రాణాంతకమైన గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని తాజా అధ్యయనాలు నిరూపించాయి

TV9 Telugu

ఈ పండును తినడం మూత్రపిండాల ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది

TV9 Telugu

అరటిపండ్లు ఎముకలను బలపరచడంలో సహాయపడతాయి. ఎముకలను ఎక్కువ కాలం బలంగా ఉంచుకోవాలంటే రోజుకు ఒక అరటిపండు తినడం ప్రారంభించాలి

TV9 Telugu

విటమిన్ సి పుష్కలంగా ఉండే అరటిపండ్లు రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ప్రభావవంతంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు అరటిపండ్లు తినొచ్చు

TV9 Telugu

అరటిపండ్లు పేగుల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ ఒక అరటిపండు తినాలి. అలాగే అరటిపండ్లు తినడం వల్ల మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది