Menstrual Hygiene: ఆ సమయంలో స్నానం చేయవచ్చా? అమ్మాయిలు ఇది మీ కోసమే..

ప్రతి నెలా వచ్చే పీరియడ్స్‌ చాలా మంది శాపంగా భావిస్తారు. ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పి, మూడ్‌ స్వింగ్స్‌.. మేనేజ్‌ చేయడం అంత సులువుకాదు. అందుకే ఈ సమయం ప్రతి అమ్మాయికి చాలా క్లిష్టంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు. నిజానికి పీరియడ్స్‌ .. అనేది ఒక సహజ జీవ ప్రక్రియ..

Menstrual Hygiene: ఆ సమయంలో స్నానం చేయవచ్చా? అమ్మాయిలు ఇది మీ కోసమే..
Menstrual Hygiene In Women

Updated on: Jun 02, 2025 | 9:52 PM

అమ్మాయిల్లో ప్రతి నెలా వచ్చే పీరియడ్స్‌ అత్యంత కీలకమైన సమయం. దీనిని చాలా మంది శాపంగా భావిస్తారు. ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పి, మూడ్‌ స్వింగ్స్‌.. మేనేజ్‌ చేయడం అంత సులువుకాదు. అందుకే ఈ సమయం ప్రతి అమ్మాయికి చాలా క్లిష్టంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు. నిజానికి పీరియడ్స్‌ .. అనేది ఒక సహజ జీవ ప్రక్రియ. ఈ సమయంలో సరైన పరిశుభ్రత పాటించడం చాలా అవసరం. ముఖ్యంగా ఆ మూడు రోజులు స్నానం చేయవచ్చా? లేదా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

పీరియడ్స్‌ సమయంలో రోజుకు ఒకసారి తప్పనిసరిగా స్నానం చేయాలి. ఈ సమయంలో పరిశుభ్రత అ సౌకర్యాన్ని దూరం చేస్తుంది. ఈ సమయంలో అధిక రక్తస్రావం, చెమట పట్టకపోతే సాధారణంగా రోజుకు ఒకటి కంటే ఎక్కువసార్లు స్నానం చేయవలసిన అవసరం లేదు. అధిక రక్తస్రావం జరిగితే మాత్రం రెండు పూటలా స్నానం చేయడం బెటర్‌. ఇలా చేయడం వల్ల చికాకు తగ్గించడంలో సహాయపడుతుంది. నెలసరి సమయంలో రోజుకు ఒకసారి గోరువెచ్చని స్నానం చేయడం మంచిది కాదు. అధిక వేడి నీరు ఉపశమనం కలిగించినప్పటికీ, ఇది రక్త నాళాలను వ్యాకోచించడం ద్వారా తాత్కాలికంగా రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. స్నానం చేసేటప్పుడు జననేంద్రియ ప్రాంతాన్ని సాధారణ నీటితో తక్కువ గడత కలగిన సబ్బుతో సున్నితంగా శుభ్రం చేయడం ముఖ్యం. అయితే సబ్బులను అంతర్గతంగా వాడటం అంత మంచిది కాదు. దీని వల్ల సహజ pH సమతుల్యత దెబ్బతింటుంది. చికాకు, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

అలాగే ప్రతి 4 నుండి 6 గంటలకు ప్యాడ్లు, టాంపూన్లను మార్చాలి. మెన్స్ట్రువల్ కప్పులను ఉపయోగించే వారు వీటిని 12 గంటల వరకు ఉపయోగించవచ్చు. కానీ అధిక రక్తస్రావం ఉన్న రోజుల్లో పరిశుభ్రతను కాపాడుకోవడానికి తరచుగా మార్చాల్సి ఉంటుంది. ఈ సమయంలో కాటన్‌తో తయారు చేసిన శుభ్రమైన లోదుస్తులను ధరించడం వల్ల తేమ పేరుకుపోకుండా నిరోధించవచ్చు. ఇది అసౌకర్యం, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఈ సమయంలో బిగుతుగా ఉండే లోదుస్తులు, సింథటిక్ దుస్తులు ధరించకూడదు.

ఇవి కూడా చదవండి

గమనిక: ఈ కంటెంట్‌ సాధారణ సమాచారం మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.