
జనవరి 12 నేడు స్వామి వివేకానంద జయంతి. అలాగే జాతీయ యువజన దినోత్సవం. వివేకానంద యువతలో స్పూర్తినింపే ఎన్నో గొప్ప విషయాలను తెలియజేయడం జరిగింది. ఆయన ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. వివేకానంద ఆత్మవిశ్వాసం, ధైర్యానికి ప్రతీక, కార్యదక్షత కలిగిన యువకులను తయారు చేయాలి అనుకున్నారు. ఈయన ఆ రోజుల్లోనే యువత విజయ పథంలో నడవడానికి ఎన్నో గొప్ప గొప్ప విషయాలను తెలియజేయడం జరిగింది.

వివేకానంద ప్రసంగం , ఆయన సూత్రాలు, ఆదర్శాలు ప్రతి ఒక్కరికీ స్పూర్తి దాయకం, దేశాభివృద్ధి అనేది యువతతోనే సాధ్యం అవుతుందని ఆయన విశ్వసించడం జరిగింది. అందుకే వివేకానందుడు యువతను సరైన మార్గంలో పెట్టడానికి, వారికి బంగారం లాంటి భవిష్యత్తుల చూపించాలనే లక్ష్యంతో తన సూక్తుల ద్వారా యువతలో గొప్ప భావాలను నింపడం జరిగింది.

ఇప్పటికీ చాలా మంది వివేకానంద మాటల ప్రేరణలో నడుస్తూ సక్సెస్ ఫుల్ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అందుకే అంటారు, భారతదేశానికి గర్వకారణమైన కుమారుడు, యువతకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి స్వామి వివేకానంద. ఈయన సూత్రాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి.

స్వామి వివేకానంద యువతకు మొదటి ప్రాధాన్యతనిచ్చేవాడు. ఆయన దేశ అభివృద్ధి అనేది యువతపైనే ఆధారపడి ఉంటుందని బలంగా నమ్మాడు. అందుకే వారిలో గొప్ప గొప్ప భావాలను నింపి, సరైన మార్గంలో వెళ్లేలా చేసేవారు. ఈ క్రమంలోనే యువత వివేకానంద ఆలోచనలు అనుసరించి, వారికి సరైన మార్గం చూపెట్టడం కోసం ప్రభుత్వం 1984లో స్వామి వివేకానంద జయంతిని యువజన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది.దీని తర్వాత, భారతదేశంలో మొదటిసారిగా 1985లో జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకున్నారు. అప్పటి నుండి, ప్రతి సంవత్సరం స్వామి వివేకానంద జన్మదినమైన జనవరి 12న జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

ఇక యువజన దినోత్సవం ముఖ్య లక్ష్యం స్వామి వ వేకానంద విలువలను, ఆదర్శాలను ప్రోత్సహించడం, దేశంలోని యువతకు ఆయన ఆలోచనల గురించి తెలియజేయడం. అంతే కాకుండా జాతీయ యువజన ముఖ్య ఉద్దేశ్యం భారత దేశ యువతను ప్రేరేపించడం, వారి జీవిత లక్ష్యాల గురించి అవగాహన పెంచడం.