Cancer: క్యాన్సర్‌ ఎందుకు ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది.? అసలు కారణం ఏంటంటే..

|

Jul 05, 2024 | 3:06 PM

ఇటీవల టీవి నటి హీనా ఖాన్‌కు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే ఈ క్యాన్సర్‌ మూడో దశలో ఉన్నప్పుడు గుర్తించారు. మరి అంత డబ్బు, చదువు ఉన్న వారిలో కూడా ఈ వ్యాధి ప్రాథమిక స్థాయిలో ఎందుకు నిర్ధారణ కాలేదు.? అసలు క్యాన్సర్‌ చివరి దశలోనే ఎందుకు బయటపడుతుంది లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Cancer: క్యాన్సర్‌ ఎందుకు ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది.? అసలు కారణం ఏంటంటే..
Cancer
Follow us on

క్యాన్సర్‌ మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న వ్యాధుల్లో ఒకటి. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఈ వ్యాధి బారిన పడుతుంటారు. ఒక్కసారి వచ్చిందంటే అంత సులభంగా క్యాన్సర్‌ నుంచి బయటపడలేము. మారుతోన్న జీవన శైలి, ఫుడ్‌ హాబిట్స్ కారణంగా ఇటీవల చాలా మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.

ఇటీవల టీవి నటి హీనా ఖాన్‌కు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే ఈ క్యాన్సర్‌ మూడో దశలో ఉన్నప్పుడు గుర్తించారు. మరి అంత డబ్బు, చదువు ఉన్న వారిలో కూడా ఈ వ్యాధి ప్రాథమిక స్థాయిలో ఎందుకు నిర్ధారణ కాలేదు.? అసలు క్యాన్సర్‌ చివరి దశలోనే ఎందుకు బయటపడుతుంది లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం ప్రతీ ఒక్కరి జీవశైలి పూర్తిగా మారిపోతోంది. స్మోకింగ్, ఆల్కహాల్‌ సర్వసాధారణ అంశాలు మారుతున్నాయి. ఇక శారరీక శ్రమ పూర్తిగా తగ్గిపోతోంది. తినడానికి కూడా సమయం లేని పరిస్థితులు ఉంటున్నాయి. దీంతో ఏది పడితే అది తింటున్నారు. ఇది రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా వ్యాధుల బారిన పడడం ఎక్కువుతోంది.

బిజీగా మారిన జీవన విధానం కారణంగా కూడా వ్యాధులను త్వరగా గుర్తించకలేకపోతున్నారు. నిజానికి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా కనీసం 6 నెలలకు ఒకసారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలి. సంబంధిత పరీక్షలు చేయించుకొని, ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై ఓ క్లారిటీతో ఉండాలి. మితిమీరిన ఒత్తిడి కారణంగా కూడా ఆరోగ్యంపై నిర్లక్ష్యం పెరుగుతోంది.

ఇక మనకు ఏ వ్యాధి వచ్చినా శరీరంలో ముందుగానే కొన్ని రకాల లక్షణాలు చూపిస్తుంటుంది. అయితే చాలా మంది వీటిని లైట్‌ తీసుకుంటున్నారు. క్యాన్సర్‌ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. అయితే క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ నిర్లక్ష్యంగా కారణంగా వైద్యులను సంప్రదించకపోవడంతో ఈ సమస్య వస్తుంది. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఇతరులతో చెబితే ఏం అనుకుంటారో అన్న కారణంగా కూడా కొందరు షేర్‌ చేసుకోరు.

అయితే సమస్యను స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో పంచుకుంటే, సలహాలు సూచనలు ఇస్తారు. శరీరంలో ఏ చిన్నా మార్పు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. వీలైనంత త్వరగా సంబంధిత పరీక్షలు చేయించుకుంటే సమస్య ముందుగానే గుర్తించవచ్చు. దీంతో చికిత్స కూడా సులభతరమవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..