Bald head: బట్టతల మగవారిలోనే అధికం.. అసలు కారణం ఏంటో తెలుసా.?

| Edited By: Ravi Kiran

Oct 12, 2024 | 8:15 PM

జుట్టు రాలడానికి మానసిక ఆరోగ్యం కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. మహిళలతో పోల్చితే పురుషులు త్వరగా ఒత్తిడికి గురికవాడమే దీనికి ప్రధాన కారణమని అంటున్నారు. మానసిక సమస్యలు కూడా పురుషుల్లో బట్టతల రావడానికి దారి తీస్తాయని అంటున్నారు. సామాజిక, ఆర్థికపరమైన అంశాల్లో తలెత్తే ఇబ్బందుల కారణంగా..

Bald head: బట్టతల మగవారిలోనే అధికం.. అసలు కారణం ఏంటో తెలుసా.?
Bald Head
Follow us on

బట్టతల అనగానే పురుషుల్లోనే అధికంగా కనిపిస్తుందని తెలిసిందే. బట్టతల కారణంగా మానసికంగా కూడా ఇబ్బందులు పడే వారు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో ఇప్పుడీ సమస్య ఎక్కువుతోంది. స్త్రీలలో కూడా జుట్టు రాలే సమస్య ఉన్నా.. పురుషుల్లోనే ఈ సమస్య అధికంగా ఉంటుందని తెలిఇసందే. అయితే పురుషుల్లోనే బట్టతల రావడానికి అసలు కారణం ఏంటి.? ఇందుకు ఏయే అంశాలు దారి తీస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

జుట్టు రాలడానికి మానసిక ఆరోగ్యం కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. మహిళలతో పోల్చితే పురుషులు త్వరగా ఒత్తిడికి గురికవాడమే దీనికి ప్రధాన కారణమని అంటున్నారు. మానసిక సమస్యలు కూడా పురుషుల్లో బట్టతల రావడానికి దారి తీస్తాయని అంటున్నారు. సామాజిక, ఆర్థికపరమైన అంశాల్లో తలెత్తే ఇబ్బందుల కారణంగా.. మెదడు హార్మోన్ల విడుదల్లో ఆటంకం ఏర్పడుతుందని ఇది జుట్టురాలడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇక పురుషులు అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్ వంటి అలవాట్లు కూడా బట్టతలకు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. పురుషుల్లో ఆల్కహాల్‌, స్మోకింగ్ అలవాట్లు పెరుగుతుండడం బట్టతలకు ఒక కారణమని నిపుణులు అంటున్నారు. ఇక శరీరంలో విటమిన్‌ డి, సి, ఐరన్‌, జింక్‌, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ లోపించడం వల్ల కూడా బట్టతలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. డీహైడ్రేషన్‌ కూడా జుట్టు రాలడానికి కారణమవుతుందని అంటున్నారు. శరీరంలో తగినంత వాటర్‌ కంటెంట్‌ లేకపోతే కూడా జుట్టు రాలడానికి దారి తీస్తుందని అంటున్నారు.

మహిళలతో పోల్చితే పురుషుల్లో జుట్టు ఎక్కువ రాలడాఇనకి ప్రధాన కారణాల్లో హార్మోన్లు, విటమిన్ల లోపం కారణమని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు జుట్టు సంరక్షణ విషయంలో మహిళలతో పోల్చితే పురుషులు పెద్దగా పట్టించుకోకపోవడం కూడా పురుషుల్లో బట్టతల రావడానికి కారణాలుగా అంటున్నారు. అయితే మంచి ఆహారంతో పాటు, జీవనశైలిలో మార్పులతో జుట్టు రాలే సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..