Ice Cream-Gulab Jamun: గులాబ్ జామ్, ఐస్ క్రీమ్ కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా..

కొన్ని కొన్ని ఫుడ్ కాంబినేషన్స్.. ఎంత తిన్నా ఇంకా తినాలని అనిపిస్తుంది. వాటిని నార్మల్‌గా తినడం కంటే.. మరో ఫుడ్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఎన్ని సార్లు తిన్నా ఇంకా ఇంకా తినాలని అంటుంది. ఇలా స్పైసీగానే కాకుండా స్వీట్లలో కూడా ఉంటుంది. అయితే కొన్ని ఆరోగ్యానికి మంచి చేసేవి ఉంటే.. మరికొన్ని అనారోగ్య సమస్యలు తెచ్చేవి కూడా ఉంటాయి. వీటిని తినడం వల్ల పోషకాలు అనేవి శరీరానికి చేరుకోవు. ఇలాంటి ఫుడ్ కాంబినేషన్స్‌లో..

Ice Cream-Gulab Jamun: గులాబ్ జామ్, ఐస్ క్రీమ్ కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా..
Ice Cream Gulab Jamun
Follow us

|

Updated on: Jul 01, 2024 | 6:01 PM

కొన్ని కొన్ని ఫుడ్ కాంబినేషన్స్.. ఎంత తిన్నా ఇంకా తినాలని అనిపిస్తుంది. వాటిని నార్మల్‌గా తినడం కంటే.. మరో ఫుడ్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఎన్ని సార్లు తిన్నా ఇంకా ఇంకా తినాలని అంటుంది. ఇలా స్పైసీగానే కాకుండా స్వీట్లలో కూడా ఉంటుంది. అయితే కొన్ని ఆరోగ్యానికి మంచి చేసేవి ఉంటే.. మరికొన్ని అనారోగ్య సమస్యలు తెచ్చేవి కూడా ఉంటాయి. వీటిని తినడం వల్ల పోషకాలు అనేవి శరీరానికి చేరుకోవు. ఇలాంటి ఫుడ్ కాంబినేషన్స్‌లో ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామ్ కూడా ఒకటి. చాలా మందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టం. చిన్న వారైనా పెద్దవారైనా ఒక కప్పు తర్వాత మరో కప్పు లాగించేస్తూ ఉంటారు.

ఎన్నో శుభ కార్యాలు, ఫంక్షన్స్‌లో కూడా గులాబ్ జామ్ అండ్ ఐస్ క్రీమ్ పెడుతూ ఉంటారు. స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత ఇది ఒక కప్పు లాగిస్తే ఆహా.. ప్రాణం లేచి వస్తుంది. ఇక చిన్న పిల్లలు అయితే ఈ ఫుడ్ కౌంటర్ దగ్గర ఉంటారు. నిజానికి ఐస్ క్రీమ్ తింటే కొన్ని రకాల లాభాలు ఉన్నాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గి.. మనసు ప్రశాంతంగా ఉంటుంది. తల నొప్పి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. బరువు కూడా తగ్గుతారు. కానీ గులాబ్ జామ్‌తో కలిపి తింటే మాత్రం అనారోగ్య సమస్యలు రావడం ఖాయం. మరి ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

డయాబెటీస్:

ఈ రెండు కాంబినేషన్లు కలిపి తినడం వల్ల షుగర్ లెవల్స్ పెరగచ్చు. డయాబెటీస్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఐస్ క్రీమ్‌లో, గులాబ్ జామ్‌లో కూడా షుగర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే.. షుగర్ ఖచ్చితంగా రావచ్చు. వేరు వేరుగా తినడం కంటే వీటిని కలిపి తింటేనే ప్రమాదం ఎక్కువ.

ఇవి కూడా చదవండి

బరువు పెరుగుతారు:

గులాబ్ జామ్, ఐస్ క్రీమ్ కలిపి తినడం వల్ల బరువు అనేది పెరుగుతారు. ఫ్యాట్ అనేది మీ శరీరంలో పేరుకు పోతుంది. ఈ రెండూ కలిపి కొద్దిగా తిన్నా చాలు బరువు ఖచ్చితంగా పెరుగుతారు. బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది.

జీర్ణ సమస్యలు పెరుగుతాయి:

అసలు భోజనం చేసిన తర్వాత స్వీట్ అనే పదార్థం అస్సలు తినకూడదు. ఇలా తినడం వల్ల జీర్ణ సమస్యలు అనేవి పెరుగుతాయి. తిన్న ఆహారం త్వరగా అరగదు. భోజనం చేసిన తర్వాత స్వీట్ తింటే.. ముందు తిన్న ఆహారంపై ఎఫెక్ట్ పడుతుంది. దీంతో జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దీంతో గ్యాస్, అజీర్తి, మల బద్ధకం వంటి సమస్యలు ఏర్పడతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..