Tea Side Effects: సాయంత్రం పూట టీ తాగడం ఎంత హానికరమో తెలుసా?

|

Jan 14, 2023 | 6:11 PM

వీరితో పాటు బరువు తక్కువగా ఉన్నవారు, జుట్టు, చర్మం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు టీ, కాఫీలకు దూరంగా ఉండాలి.

Tea Side Effects: సాయంత్రం పూట టీ తాగడం ఎంత హానికరమో తెలుసా?
Tea
Follow us on

సాధారణంగానే ప్రజలు కాఫీ, టీతోనే తమ రోజును ప్రారంభిస్తారు.. ఇక ఈ శీతాకాలంలో మరీ ఎక్కువగా కాఫీ, టీలు తాగేస్తుంటారు. అలా రోజులో మూడు, నాలుగు సార్లు టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే సాయంత్రం సమయంలో టీ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని మీకు తెలుసా..? మీకు కూడా సాయంత్రం పూట టీ తాగే అలవాటు ఉందా? ఉంటే అది ఆరోగ్యానికి ప్రయోజనకరమా..? హానికరమా అన్నది తెలుసా? దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వివరంగా తెలుసుకుందాం…

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నిద్రించడానికి 10 గంటల ముందు కెఫిన్ తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల కాలేయం డిటాక్సిఫై అవ్వడమే కాకుండా దీనివల్ల కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో కార్టిసాల్‌ స్థాయులు తగ్గిపోతాయి. మరీ ముఖ్యంగా ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు సాయంత్రం పూట టీ తాగకూడదు. ఇది మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మంచిది కాదు. నిద్రలేమికి కారణం కావచ్చు. ఒత్తిడి, అధిక బరువు ఉన్నవారు సాయంత్రం పూట టీ తాగకూడదు. మలబద్ధకం, అసిడిటీ సమస్యలతో బాధపడేవారు, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు, గ్యాస్ సమస్యలతో బాధపడేవారు సాయంత్రం పూట టీ తాగడం మానుకోవాలి. వీరితో పాటు బరువు తక్కువగా ఉన్నవారు, జుట్టు, చర్మం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు టీ, కాఫీలకు దూరంగా ఉండాలి.

ఇకపోతే, ఒక రోజుకు ఒకటి లేదా రెండు కప్పులో టీ తాగావచ్చు. అంతకుమించి ఎక్కువగా తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే మోతాదుకు మించి టీ తాగడం వల్ల శరీరంలో డిహైడ్రేషన్ సమస్యలు తలెత్తుతాయి ఎముకలు బలహీనపడి శరీరంలో ఉండే ఐరన్ స్థాయిలు తగ్గిపోతాయి.

ఇవి కూడా చదవండి

అయితే, నైట్ షిఫ్ట్‌లలో పనిచేసే వారు సాయంత్రం టీ తాగొచ్చు. అలాగే అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు లేని వారు సాయంత్రం పూట టీ తాగవచ్చు. సంపూర్ణ జీర్ణశక్తి ఉన్నవారు, రోజూ సమయానికి ఆహారం తీసుకునే వారు, ఎలాంటి నిద్ర సమస్య లేని వారు సాయంత్రం టీని ఆస్వాదించవచ్చు.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)