Health Tips: డేంజర్.. టాయిలెట్‌లో మొబైల్ వాడుతున్నారా..? మర్చిపోయి కూడా ఆ తప్పు చేయొద్దు..

మీకు టాయిలెట్‌లో మొబైల్ ఫోన్ వాడే అలవాటు ఉందా..? గంటలు గంటలు ఫోన్‌తో టాయిలెట్‌లో ఉంటున్నారా.? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే.. ఎందుకంటే టాయిలెట్‌లో ఫోన్ వాడితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Health Tips: డేంజర్.. టాయిలెట్‌లో మొబైల్ వాడుతున్నారా..? మర్చిపోయి కూడా ఆ తప్పు చేయొద్దు..
Mobile Phone Using In Toilet

Updated on: Aug 30, 2025 | 7:06 PM

ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి పెరిగిపోవడంతో, చాలామంది ప్రశాంతత కోసం కొత్త మార్గాలను వెతుకుతున్నారు. పని, చదువుల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి కొంతమంది యువత టాయిలెట్‌ను బెస్ట్ ప్లేస్‌గా ఎంచుకుంటున్నారు. దీనికి ‘బాత్రూమ్ క్యాంపింగ్’ అని పేరు కూడా పెట్టారు. అయితే గంటల తరబడి టాయిలెట్‌లో కూర్చోవడం, ముఖ్యంగా మొబైల్ ఫోన్‌లు వాడుతూ గడపడం, తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎందుకు ఇది ప్రమాదకరం?

టాయిలెట్‌లో 30 నిమిషాలకు మించి కూర్చుంటే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

నరాలపై ఒత్తిడి: ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల వెన్నెముకపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఇది నరాలను కుదించి, తీవ్రమైన నొప్పికి కారణమవుతుంది.

ఆక్సిజన్ సరఫరాలో లోపం: ఎక్కువ సమయం టాయిలెట్‌లో కూర్చోవడం వల్ల వెనముకకు ఆక్సిజన్, పోషకాల సరఫరా తగ్గిపోతుంది. దీనివల్ల పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలు రావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవలే 30 నిమిషాలు టాయిలెట్‌లో కూర్చున్న ఒక వ్యక్తి పక్షవాతానికి గురైనట్లు ఒక సంఘటన నిరూపిస్తుంది.

సయాటిక్ నర్వ్ సమస్యలు: ఇది అరుదైనప్పటికీ.. ఎక్కువసేపు కూర్చుంటే సయాటిక్ నర్వ్ చికాకు పెడుతుంది. దీనివల్ల కాళ్ళలో తిమ్మిరి, జలదరింపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక 40 ఏళ్ల వ్యక్తి మద్యం సేవించి టాయిలెట్‌లో నిద్రపోగా.. లేచి నిలబడలేకపోయాడు. చికిత్స తీసుకున్నా కూడా అతను పూర్తిగా కోలుకోలేకపోయాడు.

టాయిలెట్‌లో ఎంతసేపు ఉండాలి?

వైద్య నిపుణుల సలహా ప్రకారం.. టాయిలెట్‌లో 10-15 నిమిషాలకు మించి గడపకూడదు. మొబైల్ ఫోన్‌లను టాయిలెట్‌కు తీసుకెళ్లకుండా ఉండటం మంచిది. ఇది టాయిలెట్‌లో గడిపే సమయాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. చదవడం లేదా మొబైల్ ఫోన్ వాడకం వంటి అలవాట్లను టాయిలెట్‌లో మానుకోవాలి.

తీసుకోవలసిన జాగ్రత్తలు

టాయిలెట్ సీటుపై ప్యాడెడ్ కవర్ ఉపయోగించడం మంచిది.

టాయిలెట్ వాడిన తర్వాత మీ కాళ్ళు గట్టిపడినట్లు లేదా తిమ్మిరిగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇది భవిష్యత్తులో స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.

మొబైల్ ఫోన్‌లు మన జీవితంలో భాగమైనప్పటికీ, వాటిని ఉపయోగించే సమయం, ప్రదేశం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే తాత్కాలిక సంతోషం కోసం మనం తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టే అవుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..