Beauty Tips: మృదువైన చర్మం కోసం 5 చిట్కాలు..! కొద్ది రోజుల్లోనే తేడా గమనిస్తారు..

|

Sep 21, 2021 | 9:40 PM

Beauty Tips: మృదువైన చర్మం సాధించడం ఒక కల. అందుకోసం మార్కెట్లో లభించే అన్ని ప్రొడక్ట్స్‌ని వాడుతారు. అయినా కూడా ఫలితం ఉండదు. అందమైన చర్మం కోసం

Beauty Tips: మృదువైన చర్మం కోసం 5 చిట్కాలు..! కొద్ది రోజుల్లోనే తేడా గమనిస్తారు..
Soft Skin
Follow us on

Beauty Tips: మృదువైన చర్మం సాధించడం ఒక కల. అందుకోసం మార్కెట్లో లభించే అన్ని ప్రొడక్ట్స్‌ని వాడుతారు. అయినా కూడా ఫలితం ఉండదు. అందమైన చర్మం కోసం ప్రొడక్ట్స్ మాత్రమే కాదు లైఫ్ స్టైల్‌లో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య కరమైన చర్మం కోసం ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవడం చాలా ముఖ్యం. చర్మం నిత్యం యవ్వనంగా మెరుస్తూ ఉండాలంటే ఈ 5 చిట్కాలు పాటించాలి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. మాయిశ్చరైజింగ్
ఆరోగ్యకరమైన చర్మానికి మాయిశ్చరైజింగ్ తప్పనిసరి. బాడీ సబ్బును ఉపయోగించాలి. అప్పుడే చర్మం మృదువుగా శుభ్రంగా ఉంటుంది. ఎండలో ఎక్కువగా తిరగకూడదు.

2. సమతుల్య ఆహారం
ఆరోగ్యకరమైన చర్మం కోసం సమతుల్య ఆహారం తినాలి. ఆహారంలో ఉండే పోషకాలు, ఖనిజాలు, ప్రోటీన్లు కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతాయి. ఆరోగ్యకరమైన కణ ఉత్పత్తికి సాయం చేస్తాయి. UV ఎక్స్‌పోజర్ వంటి హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.

3. చిరునవ్వు
ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. మనం నవ్వినప్పుడు రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. చర్మానికి ఎక్కువ ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. అప్పుడు ఆరోగ్యకరమైన మెరుస్తూ ఉండే చర్మం మీ సొంతమవుతుంది.

4. తగినంత నీరు తాగాలి
మీ చర్మం అన్ని సమస్యలను తొలగించడంలో నీరు బాగా ఉపయోగపడుతుంది. మీరు తగినంత నీరు తాగినప్పుడు ఇది మీ శరీరం నుంచి వచ్చే టాక్సిన్లను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తుంది. కొన్ని రోజులు తగినంత నీరు తాగండి మీరే తేడా గమనిస్తారు. సహజమైన గ్లో కూడా వస్తుంది.

5. మేకప్‌తో నిద్రపోవడం
ఈ రోజుల్లో అందరూ మేకప్ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇది ఫ్యాషన్‌గా మారిపోయింది. కానీ మీరు నిద్రపోయే ముందు దానిని తొలగించుకోకపోతే అది మీ చర్మాన్ని పాడు చేస్తుంది. నిద్రపోయే ముందు మొదట మీ ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోండి. ఇది మీ చర్మ రంధ్రాలకు గాలి తగిలేలా చేస్తుంది. తద్వారా మంచి గ్లో ఏర్పడుతుంది. అందుకే నిద్రపోయే ముందు ప్రతిరోజూ మీ ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మంచిది.

Big News Big Debate: కేటీఆర్‌ కేంద్రంగా కుట్ర జరుగుతోందా..? టీఆర్‌ఎస్‌ విసిరిన సవాల్‌కు రాహుల్‌ సిద్ధమేనా..?

అధిక బీపీ ఉన్నవారు ఈ 5 ఆహారాలను అస్సలు తినకూడదు..! ఎందుకంటే

Mahant Narendra Giri: ఎన్నో అనుమనాలు..మరెన్నో ప్రశ్నలు.. మిస్టరీగా మారిన మహంత్ నరేంద్రగిరి సూసైడ్‌..