హెవీ వర్కవుట్స్‌తో ఆడవాళ్లకు నష్టమా? బాలీవుడ్ ఫిట్‌నెస్ ఫ్రీక్ టెక్నిక్స్ ఇవే

ప్రస్తుత ఆధునిక కాలంలో మగవాళ్లతో సమానంగా మహిళలు కూడా జిమ్‌లలో చేరి కఠినమైన వ్యాయామాలు చేస్తున్నారు. అయితే, ఆడవాళ్లు హెవీ వర్కవుట్స్ లేదా వెయిట్ లిఫ్టింగ్ (బరువులు ఎత్తడం) చేస్తే శరీరానికి ఏమైనా నష్టాలు ఉంటాయా? అనే అనుమానాలు చాలామందిలో వ్యక్తమవుతుంటాయి. కానీ, అలాంటి అపోహలు పక్కన పెట్టి మీ శరీర శక్తి మేరకు ఎలాంటి వర్కవుట్స్ అయినా ధైర్యంగా చేయొచ్చని అంటోంది బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ, ఫిట్‌నెస్ ఫ్రీక్ దిశా పఠాని.

హెవీ వర్కవుట్స్‌తో ఆడవాళ్లకు నష్టమా? బాలీవుడ్ ఫిట్‌నెస్ ఫ్రీక్ టెక్నిక్స్ ఇవే
Fitness Secrets Of Disha Patani

Updated on: May 22, 2026 | 6:00 AM

జిమ్‌లో కేవలం తక్కువ బరువున్న వాటితో ఎక్కువ రెప్స్ చేయడం కంటే, ఎక్కువ బరువు ఉన్న వాటితో తక్కువ రెప్స్ చేయడం ఎంతో మంచిదని బాలీవుడ్​ బ్యూటీ దిశా పఠాని సూచిస్తోంది. ఇది కండరాల బలాన్ని పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. కేవలం ఫ్యాట్ తగ్గించుకోవడానికే కాదు, మంచి శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా వర్కవుట్ ఎంతో అవసరం. క్రమం తప్పకుండా బలమైన వర్కవుట్స్ అలవాటు చేసుకోవడం వల్ల శరీర ఆకృతిలో వచ్చే అద్భుతమైన మార్పును మనమే గమనించవచ్చని ఆమె చెబుతోంది. మరి ఈ స్టార్ హీరోయిన్ ఫాలో అయ్యే కొన్ని ముఖ్యమైన వర్కవుట్ టెక్నిక్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

కండరాల దృఢత్వానికి బెస్ట్ ఛాయిస్

శరీరంలో మజిల్స్ (కండరాలు) పెరగడానికి మరియు అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ కోసం షోల్డర్ ప్రెస్ అనేది ఒక బెస్ట్ వర్కవుట్ అని దిశా పఠాని వివరిస్తోంది. ఈ ఎక్సర్‌సైజ్‌ను మన వీలును బట్టి కూర్చుని లేదా నిల్చుని కూడా చేయవచ్చు. దీనికోసం రెండు చేతుల్లోనూ మనకు కంఫర్ట్‌గా ఉండేలా డంబెల్స్ తీసుకోవాలి. ఆపై రెండు చేతులను సమానంగా పైకి లేపుతూ, మళ్లీ కిందికి దించుతూ చేసే ఈ ఎక్సర్‌సైజ్ నేరుగా మన కోర్ మజిల్స్ పై అద్భుతమైన ఫలితాన్ని చూపిస్తుంది. చేసే వ్యాయామం ఏదైనా సరే.. దానికి ముందు మంచి వామప్ చేయడం అత్యంత కీలకం. ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ మరియు వామప్ అనేది వర్కవుట్‌కి ముందు ఒక మంచి కాంబినేషన్ అని చెప్పవచ్చు. ఇది మన హార్ట్ బీట్ (గుండె వేగం)ను, బాడీ టెంపరేచర్‌ను కంట్రోల్ చేసి, శరీరాన్ని హెవీ వర్కవుట్స్‌కు సిద్ధం చేస్తుంది.

పర్ఫెక్ట్ యాబ్స్ కోసం క్రంచెస్ మ్యాజిక్

నడుము చుట్టూ ఉన్న కొవ్వును కరిగించి పర్ఫెక్ట్ యాబ్స్ సొంతం చేసుకోవడానికి ‘క్రంచెస్’చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందుకోసం ముందుగా ఒక మ్యాట్ పై ప్రశాంతంగా పడుకోవాలి. ఆపై రెండు మోకాళ్లను 90 డిగ్రీల కోణంలో పైకెత్తి, లోయర్ బ్యాక్ (నడుము కింది భాగం) పూర్తిగా మ్యాట్ కు ఆనేలా ఉంచాలి. ఆ తర్వాత చేతులను తల వెనుక ఉంచి, మన ఛాతి మోకాళ్లకు తగులుతున్నట్లుగా నెమ్మదిగా పైకి లేస్తూ ఈ ఎక్సర్‌సైజ్‌ను కంటిన్యూ చేయాలి. ఇది పొట్ట భాగంలో ఉన్న ఫ్యాట్‌ను వేగంగా కరిగిస్తుంది.

సెల్ఫ్ మోటివేషన్..

ఫిట్‌నెస్ అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు, దీనిని రెగ్యులర్‌గా మన దినచర్యలో భాగంగా మార్చుకోవాలి. ఈ ప్రయాణంలో మనకు ‘సెల్ఫ్ మోటివేషన్’ (స్వీయ ప్రేరణ) అనేది తప్పకుండా ఉండాలి, అప్పుడే అనుకున్న టార్గెట్‌ను సులభంగా రీచ్ అవ్వగలమని దిశా చెబుతోంది. దీనికోసం ఆమె ఒక సింపుల్ టెక్నిక్ పాటిస్తుంది. మనం ప్రతిరోజూ చేసే వర్కౌట్స్ విశేషాలను ఫోటోలు లేదా వీడియోలుగా తీసి భద్రంగా దాచుకోవాలి. ముఖ్యంగా సిక్స్ ప్యాక్ యాబ్స్ లేదా ‘మాబ్స్’ కోసం ట్రై చేస్తున్నప్పుడు, ప్రతి వారం ఫోటోల ద్వారా మన ప్రోగ్రెస్‌ను రికార్డ్ చేసుకోవాలి. కొన్ని రోజుల తర్వాత వాటిని తిరిగి చూసుకుంటుంటే మన శరీరంలో వస్తున్న మార్పులు స్పష్టంగా తెలుస్తాయి. ఇవి మనలో కాన్ఫిడెన్స్ విపరీతంగా పెంచి, మరింత కష్టపడటానికి బూస్టింగ్ ఇస్తాయి.

హెవీ వర్కవుట్స్ చేయడం వల్ల మహిళలు మగవారిలా మారిపోతారనేది కేవలం అపోహ మాత్రమే. సరైన ట్రైనర్ సమక్షంలో, పౌష్టికాహారం తీసుకుంటూ బరువులు ఎత్తడం వల్ల మహిళల శరీరం మరింత ఫిట్‌గా, స్ట్రాంగ్‌గా మారుతుంది. మీ దైనందిన జీవితంలో కూడా ఈ ఫిట్‌నెస్ సూత్రాలను పాటించి, అద్భుతమైన ఆరోగ్య మార్పులను సొంతం చేసుకోండి.

Follow Us