అసలే వర్షాకాలం.. అందులోనూ డెంగ్యూ భయం

| Edited By:

Sep 02, 2019 | 9:27 PM

జ్వరాల్లో అతి భయంకరమైన జ్వరంగా భయపెట్టేది డెంగ్యూ. దీని పేరు వినగానే ఎలాంటివారికైనా వణుకుపుడుతుంది. ఈ వ్యాధి సోకిన వారి శరీరంలో ప్లేట్‌లెట్లు ఉన్నపాటుగా తగ్గిపోయి నీరసంగా తయారవుతారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. డెంగ్యూ వ్యాధికి ఆర్బోవైరస్‌ జాతికి చెందిన వైరస్‌ కారణం. ఈ వైరస్‌ ఎయిడిస్‌ ఈజిప్టి జాతి దోమద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా డెంగ్యూను వ్యాపింపజేసే దోమను టైగర్‌ దోమ అని కూడా అంటారు. ఈదోమలు సాధారణంగా పగటి పూటే […]

అసలే వర్షాకాలం.. అందులోనూ డెంగ్యూ భయం
Follow us on

జ్వరాల్లో అతి భయంకరమైన జ్వరంగా భయపెట్టేది డెంగ్యూ. దీని పేరు వినగానే ఎలాంటివారికైనా వణుకుపుడుతుంది. ఈ వ్యాధి సోకిన వారి శరీరంలో ప్లేట్‌లెట్లు ఉన్నపాటుగా తగ్గిపోయి నీరసంగా తయారవుతారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. డెంగ్యూ వ్యాధికి ఆర్బోవైరస్‌ జాతికి చెందిన వైరస్‌ కారణం. ఈ వైరస్‌ ఎయిడిస్‌ ఈజిప్టి జాతి దోమద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా డెంగ్యూను వ్యాపింపజేసే దోమను టైగర్‌ దోమ అని కూడా అంటారు. ఈదోమలు సాధారణంగా పగటి పూటే కుడతాయి. దోమలు కుట్టిన తర్వాత 5 నుండి 8 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి.

వ్యాధి లక్షణాలు :
ఉన్నట్టుండి జ్వరంతో పాటు తలనొప్పి అధికంగా ఉంటుంది. కంటిలోపల నొప్పి వచ్చి కంటి కదలికలు తగ్గుతాయి. కన్ను కదిలినప్పుడు నొప్పి ఎక్కువవుతుంది. కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతి అవుతున్నట్టు అనిపిస్తుంది. నోరు ఎండిపోతూ అతిగా నీరు తాగాలనిపిస్తుంది. ఈ లక్షణాలు కలిగి ఉంటే వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చూపించుకోవాలి. వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలి. డెంగ్యూ నివారణకు ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏదీ లేదు. వెంటనే స్పందించి జ్వర తీవ్రతను గుర్తించి చికిత్స చేయించుకోవాలి.

వ్యాధి వ్యాపించే విధానం :

ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా ఈ డెంగ్యూ దోమలు వృద్ధి చెందుతాయి. నీరు కనీసం వారం రోజులు నిల్వ ఉంటే ఈ రకమైన దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఈదోమ చీకటి ప్రదేశాల్లో నివసిస్తుంటుంది. వాడకుండా వదిలేసిన పచ్చడిరోళ్లు, ప్లవర్‌వాజ్‌, కొబ్బరి చిప్పలు, పగిలిన సీసాలు, పగిలిపోయిన కప్పులు, చెట్ల తొర్రలు మొదలైన వాటిలో ఎక్కువగా పెరుగుతుంది.

ముందు జాగ్రత్త అవసరం:
డెంగ్యూ వ్యాధి రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికోసం నీరు ఎక్కడా నిల్వ లేకుండా చూసుకోవాలి. నీటి నిల్వలు గల వాటిని వారానికి ఒకసారి ఖాళీ చేయించి, వారంలో ఒక రోజు డ్రైడే విధానాన్ని తప్పక పాటించడం అలవాటు చేసుకోవాలి.
వ్యక్తిగత జాగ్రత్తలు …
ఈ డెంగ్యూ వ్యాధి దోమలనుంచి వ్యాపిస్తుంది గనుక దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికోసం ముఖ్యంగా దోమ తెరలు వాడాలి, మస్కిటో కిల్లర్స్ ను వినియోగించి నివారించాలి. నిద్రపోయే ముందుకు దుస్తులు కూడా దోమలు కుట్టకుండా కాపాడే విధంగా వేసుకుంటే మంచిది. పిల్లలకు శరీర భాగాలు పూర్తిగా కప్పేటట్లు దుస్తులు వేయాలి. సొంత చికిత్స చేయకూడదు. జ్వరం వచ్చినప్పుడు సొంత చికిత్స తీసుకుంటూ టాబ్లెట్లు వాడకూడదు. వెంటనే హాస్పిటల్‌కి వెళ్లి చికిత్స తీసుకుంటే ప్రమాదం నుంచి రక్షణ పొందవచ్చు.