Apple Benefits: రోజూ ఓ తియ్యని ఆపిల్ తినండి..డయాబెటిస్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది!

|

Aug 08, 2021 | 3:05 PM

ప్రతిరోజూ ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మనమందరం ఈ విషయం చిన్నప్పటి నుండి వింటున్నాం. కానీ, దీని గురించి పెద్దగా పట్టించుకోము.

Apple Benefits: రోజూ ఓ తియ్యని ఆపిల్ తినండి..డయాబెటిస్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది!
Apple Benefets
Follow us on

Apple Benefits: ప్రతిరోజూ ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మనమందరం ఈ విషయం చిన్నప్పటి నుండి వింటున్నాం. కానీ, దీని గురించి పెద్దగా పట్టించుకోము. కొంతమంది దీని విషయాన్ని నమ్మరు కూడా. అయితే,  ప్రతిరోజూ ఒక ఆపిల్ తినడం వల్ల అనేక వ్యాధుల ముప్పు తగ్గుతుందనేది నిజం. ఆపిల్ అద్భుతమైన లక్షణాల కారణంగా, దీనిని మాంత్రిక పండు అని కూడా అంటారు. ఇది తగినంత మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్, వ్యాధి-పోరాట మూలకాలను కలిగి ఉంటుంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా చాలా ఉపయోగకారిగా ఉంటుంది.

ఆపిల్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే!

యాపిల్స్‌లో పోషకాలు పుష్కలంగా..

యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం, 2,000 క్యాలరీల ఆహారం రెండు కప్పుల పండ్లతో కలిపి తింటే వస్తుంది. కానీ, దీనిని ఒక ఆపిల్ తినడం ద్వారా పొందవచ్చు. ఎందుకంటే మీడియం సైజు (సుమారు 3 అంగుళాల వ్యాసం) యాపిల్ దాదాపు 1.5 కప్పుల పండ్లకు సమానం. 182 గ్రాముల యాపిల్‌లో 2-4% మాంగనీస్, రాగి, విటమిన్లు A, E, B1, B2 అలాగే B6 ఉంటాయి.

యాపిల్స్‌లో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరం. ఆపిల్ తొక్కలలో ఫైబర్, పాలీఫెనాల్స్ కనిపిస్తాయి కాబట్టి యాపిల్స్ పై తొక్క లేకుండా తినాలని నిపుణులు కూడా నమ్ముతారు.

ఆపిల్ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది..

ఆపిల్స్‌లో ఫైబర్, వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది, కాబట్టి దీనిని తినడం వల్ల పొట్ట త్వరగా నిండిపోతుంది. పబ్‌మేట్ సెంట్రల్‌లో జూలీ ఇ, ఫ్లడ్-ఒబెగి, బార్బరా జె. రోల్స్ పరిశోధనల ప్రకారం, ఆహారం తినడానికి ముందు ఆపిల్ తినే వ్యక్తుల కడుపు, ఆపిల్ లేదా దాని నుండి తయారైన వాటిని తినని వారి కంటే వేగంగా నిండిపోతుంది. పరిశోధకులు తమ భోజనానికి ముందు ఆపిల్ తినే వారు యాపిల్ తినని వారి కంటే 200 కేలరీలు తక్కువగా తీసుకుంటారని చెప్పారు.

ఆపిల్ గుండె ఆరోగ్యానికి కూడా..

ఆపిల్ తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన అథనాసియోస్, కీరాన్ ఎం, జూలీ పరిశోధనల ప్రకారం, కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. యాపిల్స్‌లో ఉండే పాలీఫెనాల్స్ యాంటీ ఆక్సిడెంట్‌లుగా పనిచేస్తాయి. ఫ్లేవనాయిడ్ ఎపికెటెచిన్ పాలీఫెనాల్స్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. ఫ్లేవనాయిడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల స్ట్రోక్ ప్రమాదాన్ని 20%తగ్గించవచ్చు.

డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన ఐసావో మురాకి, అతని సహచరుల పరిశోధన ప్రకారం, ఆపిల్ టైప్ -2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల టైప్ -2 డయాబెటిస్ ప్రమాదాన్ని 28%తగ్గించవచ్చు.

ఆపిల్‌లో ఉండే పాలీఫెనాల్స్ ప్యాంక్రియాస్‌లో ఉండే బీటా కణాల కణజాలాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది. ఈ బీటా కణాలు శరీరంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులలో ఈ నష్టాలు తరచుగా జరుగుతాయి.

ఆస్తమా ప్రమాదాన్ని తగ్గిస్తుంది..

ఆపిల్ ఆస్తమా ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుంది. యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే యాపిల్స్ మీ ఊపిరితిత్తులను ఆక్సీకరణ నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. 68 వేల మంది మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో, రోజూ యాపిల్స్ తినే వ్యక్తులలో ఆస్తమా వచ్చే ప్రమాదం 10 శాతం తగ్గుతుందని తేలింది.  పబ్‌మెడ్ సెంట్రల్‌లో ప్రచురించబడిన డయాన్ ఎ. హిస్సన్ చేసిన ఈ పరిశోధన ప్రకారం, ఆపిల్ తొక్కలో ఉండే ఫ్లేవనాయిడ్ క్వెర్సెటిన్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది మరియు మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా..

పబ్‌మెడ్ సెంట్రల్‌లో ప్రచురించబడిన డయాన్ ఎ. హిస్సన్ పరిశోధన ప్రకారం, ఆపిల్స్ క్యాన్సర్ వంటి ప్రధాన వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. యాపిల్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జోనాథన్ ఎమ్ హాడ్గ్సన్ , అతని సహచరులు మహిళలపై చేసిన పరిశోధనలో రోజూ యాపిల్స్ తినడం వల్ల క్యాన్సర్ వల్ల మరణించే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని తేలింది.

Also Read: Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ లడ్డూలు తినండి చాలు..

Egg Yolk: గుడ్లు తినేటప్పుడు ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా..?