Curd Storage Tips: పెరుగు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలా? ఐతే ఈ చిట్కాలు పాటించండి!

|

Aug 18, 2022 | 7:15 PM

ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫ్రిజ్‌లో పెట్టిన ఒకటి, రెండు రోజుల్లో పెరుగు పులిసిపోవడం లేదా చెడిపోవడం వంటివి జరుగుతుంటుంది. పెరుగు ఎక్కువ రోజులు రుచి మారకుండా తాజాగా నిల్వ..

Curd Storage Tips: పెరుగు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలా? ఐతే ఈ చిట్కాలు పాటించండి!
Curd
Follow us on

Best ways to properly store Curd: పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పెరుగులో ఉండే బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. పెరుగును వివిధ రకాల వంటకాల తయారీలో కూడా ఉపయోగిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. ఐతే ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫ్రిజ్‌లో పెట్టిన ఒకటి, రెండు రోజుల్లో పెరుగు పులిసిపోవడం లేదా చెడిపోవడం వంటివి జరుగుతుంటుంది. పెరుగు ఎక్కువ రోజులు రుచి మారకుండా తాజాగా నిల్వ చేసే కొన్ని చిట్కాలు మీకోసం..

తేమ, గాలి తగలని చోట పెరుగును నిల్వ చెయ్యాలి. గాలి చొరబడని కంటైనర్లు ఆహారాన్ని ఎక్కువ రోజులు తాజాగా ఉంచుతాయి. పెరుగును కూడా ఇలా కంటైనర్లలో నిల్వ చేయవచ్చు. కంటైనర్‌ నుంచి పెరుగును తీసుకున్న ప్రతిసారి కంటైనర్ మూతను గట్టిగా మూసివేయడం మాత్రం మర్చిపోకూడదు.

ఫ్రీజ్‌లో పెరుగును నిల్వ చేయడం వల్ల అందులో సూక్ష్మజీవులు చేరకుండా నిరోధించవచ్చు. కాలుషితమైన నీరు హానికరమైన బ్యాక్టీరియా పెరగడానికి దారి తీస్తుంది. ఫలితంగా ఆహారం పాడవుతుంది.

ఇవి కూడా చదవండి

చాలా మంది పాల ప్యాకెట్‌ నుంచి తీసిన పాలతో తయారు చేసిన పెరుగును ఇళ్లలో వినియోగిస్తుంటారు. ఈ పెరుగును తోడు పెట్టిన గిన్నెలోనుంచే నేరుగా తింటుంటారు. ఇది సరైన పద్ధతికాదు. పెరుగు గిన్నెలో నుంచి స్పూన్‌తో కావల్సిన మేరకు వేరే గిన్నెలోకి తీసుకుని, పెరుగు గిన్నెలో తిరిగి ఫ్రిల్‌ పెట్టాలి. ఐతే పెరుగు తీసుకోవడానికి ఉపయోగించే స్పూన్‌ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

అలాగే ఫ్రిజ్‌ డోర్‌లో పెరుగును నిల్వ చేయకూడదు. ఎందుకంటే ప్రిజ్‌ను తెరచిన ప్రతిసారి డోర్‌ మొదట వేడెక్కుతుంది. అందువల్ల పెరుగు అత్యధిక రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిజ్‌లోపల ఉంచడం బెటర్‌! ఈ చిన్నపాటి చిట్కాలు పాటించడం ద్వారా పెరుగును ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు.