Curd: పెరుగు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఇవి తెలుసుకోకపోతే ఆ సమస్యలు పక్కా..

పెరుగు జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచి ఎముకలను బలోపేతం చేస్తుంది. అయితే రాత్రిపూట తినడం, కొన్ని ఆహారాలతో కలిపి తీసుకోవడం, వేడి చేయడం వంటి తప్పులు కఫం, అసిడిటీ, జీర్ణ సమస్యలకు దారితీస్తాయి. సరైన సమయంలో, సరైన పద్ధతిలో పెరుగును తీసుకోవడం ఆరోగ్యానికి కీలకం. లేదంటే అది మేలుకు బదులు హాని కలిగిస్తుంది.

Curd: పెరుగు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఇవి తెలుసుకోకపోతే ఆ సమస్యలు పక్కా..
How To Eat Curd Right For Health

Updated on: Nov 15, 2025 | 2:31 PM

పెరుగు మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది రుచికరమైనది, జీర్ణక్రియకు సహాయపడడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలను బలోపేతం చేస్తుంది. అయితే పెరుగును సరైన సమయంలో, సరైన విధానంలో తినడం చాలా ముఖ్యం. లేదంటే అది మేలుకు బదులు హాని కలిగిస్తుంది. చాలా మంది పెరుగు తినేటప్పుడు కొన్ని సాధారణమైన, కానీ తీవ్రమైన తప్పులు చేస్తారు.

పెరుగు తినేటప్పుడు చేయకూడని ముఖ్యమైన తప్పులు:

రాత్రిపూట తినకూడదు

రాత్రిపూట పెరుగు తినడం వల్ల శరీరంలో కఫం పెరిగి, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఖాళీ కడుపుతో పెరుగు తినడం అస్సలు మంచిది కాదు. దీని వల్ల అసిడిటీ లేదా గ్యాస్ సమస్యలు రావచ్చు. అందుకే దీన్ని ఎప్పుడూ భోజనంలో భాగంగా తీసుకోవాలి.

వీటితో కలిపి తినకూడదు

పెరుగును మాంసాహారంతో కలిపి తినకూడదు. ఈ రెండింటి స్వభావాలు వేరుగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థలో సమస్యలు లేదా అలెర్జీలు రావచ్చు. అలాగే, పెరుగులో ఎక్కువ చక్కెర కలపడం వల్ల దాని ప్రోబయోటిక్ ప్రయోజనాలు తగ్గిపోయి. బరువు పెరగడానికి కారణమవుతుంది. పెరుగులో ఉప్పు కలపడం కూడా జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది.

వాడకం – నిల్వ

పెరుగును ఎప్పుడూ వేడి చేయకూడదు. వేడి చేస్తే అందులో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా నశించిపోతుంది. పాత లేదా బాగా పుల్లగా ఉండే పెరుగును తినడం వల్ల గ్యాస్, అజీర్ణం వంటి కడుపు సమస్యలు వస్తాయి. ఫ్రిజ్ నుండి తీసిన వెంటనే చల్లని పెరుగు తినడం కూడా మంచిది కాదు. ఇది గొంతు నొప్పిని పెంచుతుంది.

పాత్రలు – ఆరోగ్యం

అల్యూమినియం లేదా రాగి వంటి లోహపు పాత్రలలో పెరుగు తినడం మానుకోవాలి. ఎందుకంటే పెరుగులోని ఆమ్ల స్వభావం వల్ల హానికరమైన రసాయన ప్రతిచర్య ఏర్పడవచ్చు. అలాగే మీకు విరేచనాలు, వాంతులు లేదా కడుపులో చికాకు ఉన్నప్పుడు పెరుగు తినడం పూర్తిగా మానుకోవాలి. ఎందుకంటే ఇది పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశం ఉంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us