డైట్‌ కంట్రోల్‌తో వ్యాయామం..డేంజర్‌ సుమా !

డైట్‌ కంట్రోల్‌తో వ్యాయామం..డేంజర్‌ సుమా !

అధిక బరువు నియంత్రణ, సన్నగా నాజుగ్గా కనిపించాలనే తాపత్రయంతో ఇటీవల అనేక మంది కఠినమైన డైట్‌లు పాటిస్తూ..అధికశాతం వ్యాయమాలు చేస్తున్నారు. అయితే, డైటింగ్, ఎక్స్‌ర్‌సైజ్‌లు ఎక్కువైతే..అది ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతిస్తుందని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. జర్నల్‌ ఆఫ్‌ బోన్‌ అండ్‌ మినరల్‌ రీసెర్చ్‌లో ప్రచురితమైన అధ్యయనం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేస్తుంది. అధిక వ్యాయామం, మితిమీరిన డైట్‌ ప్లాన్‌ ఎముకల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందట. ఎముకలు లేని మనిషి మాంసపు ముద్దతో సమానం. అతనికి […]

Anil kumar poka

|

Sep 16, 2019 | 2:13 PM

అధిక బరువు నియంత్రణ, సన్నగా నాజుగ్గా కనిపించాలనే తాపత్రయంతో ఇటీవల అనేక మంది కఠినమైన డైట్‌లు పాటిస్తూ..అధికశాతం వ్యాయమాలు చేస్తున్నారు. అయితే, డైటింగ్, ఎక్స్‌ర్‌సైజ్‌లు ఎక్కువైతే..అది ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతిస్తుందని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. జర్నల్‌ ఆఫ్‌ బోన్‌ అండ్‌ మినరల్‌ రీసెర్చ్‌లో ప్రచురితమైన అధ్యయనం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేస్తుంది.
అధిక వ్యాయామం, మితిమీరిన డైట్‌ ప్లాన్‌ ఎముకల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందట.

ఎముకలు లేని మనిషి మాంసపు ముద్దతో సమానం. అతనికి ఒక ఆకారాన్ని ఇచ్చి, ఆ ఆకారాన్ని నడిపించే బాధ్యత ఎముకలదే! 30 ఏళ్ల వరకూ ఎముకల పెరుగుదల వేగంగా ఉంటుంది. ఎముకలు నానాటికీ బలాన్ని పుంజుకుంటాయి. అప్పటివరకూ ఎముకలు తగినంతగా ఎదిగేందుకు అవసరమయ్యే పోషకాలను శరీరానికి అందించాల్సి ఉంటుంది. ఇక 30 ఏళ్ల తరువాత ఎముకల ఎదుగుదల కంటే తరుగుదలే అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ మహిళ్లలో ఎముక ఆరోగ్యం ఎక్కువగా క్షీణించడం మొదలవుతుంది. ఎక్కువగా వ్యాయమం చేస్తూ.. డైటింగ్‌ ఫాలో అయ్యే వారి శరీరంలో కెలరీలు తగ్గిపోయి…ఎముకల్లో బలం లేకుండా పోయి పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంటుందట. ఈ మేరకు సీనియర్ రచయిత మాయా స్టైనర్, అసోసియేట్ యుఎస్ లోని నార్త్ కరోలినా స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ వెల్లడించారు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్‌ ప్రకారం.. 30 ఏళ్ల వయస్సులో ఉన్న సాధారణ మహిళ రోజుకు 2,000 కేలరీలు తీసుకోవాలని సూచిస్తున్నారు. శరీరానికి సరిపడా కెలరీలను తీసుకుంటూ..తగినంత వ్యాయామం చేస్తే..సరిపోతుందని వారు చెబుతున్నారు. సో సరైనా ఆహారం నిపుణుల సలహా మేరకు వ్యాయామం చేస్తూ..ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవాలని జర్నల్‌ ఆఫ్‌ బోన్‌ అండ్‌ మినరల్‌ రీసెర్చ్‌ సూచిస్తోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu