మారుతోన్న జీవన విధానం, తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల హైబీపీ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. చిన్న వయసు వారు కూడా బీపీ బారిన పడుతున్నారు. అయితే బీపీ సమస్య ఉన్న వారు జీవన శైలిలో చిన్న చిన్న మార్పులతో సులభంగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బీపీ ఉన్న వారు డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి చెబుతుంటారు. మరీ ముఖ్యంగా వచ్చే ఎండకాలంలో శరీరంలో తగినంత నీరు ఉండేలా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. అయితే బీపీ సమస్యతో బాధపడే వారికి కొబ్బరి నీరు దివ్యౌషధంగా చెబుతున్నారు. ఇందులోని ఎన్నో సహజ గుణాలు శరీరానికి మేలు చేస్తాయి. బీపీ కంట్రోల్‌లో ఉండడంలో ఉపయోగపడతాయి. ఇంతకీ కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల బీపీతో బాధపడే వారికి జరిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* కొబ్బరి నీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారం నుంచి పొటాషియం అందదు. ఇలాంటప్పుడు కొబ్బరి నీళ్లు తాగాలి. ఎందుకంటే పొటాషియం మూత్రం నుంచి సోడియం, ఐరన్ తొలగించడంలో సహాయపడుతుంది. హైబీపీ రోగులు కొబ్బరినీళ్లు తాగితే బీపీ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
* సాధారణంగా హైబీపీ రోగుల్లో సోడియం స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో సోడియం పెరిగితే అది గుండెపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల హైబీపీ సమస్య వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో హైబీపీ ఉన్నవారు కొబ్బరినీళ్లు తాగితే వారి శరీరంలోని అదనపు సోడియం బయటకు వస్తుంది. ఇలా కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా సోడియం స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.
* కొబ్బరి నీరు సిరలను శుభ్రపరుస్తుంది అలాగే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది సిరలను క్లీన్ చేయడంలో ఉపయోపగుడుతంది. దీంతో రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది.
* ఇక హై బీపీ ఉన్నవారు రోజూ ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరీ ఎక్కువ తాగినా ఇబ్బందులు తప్పవని సూచిస్తున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో కూడా కొబ్బరి నీటిని తీసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..