Tomato vs Chicken Soup: టమాటా సూప్ లేదా చికెన్ సూప్.. రోగనిరోధక శక్తికి, చర్మాన్ని మెరిసేలా చేసేందుకు ఏది బెస్ట్!

వింటర్‌లో సూప్ తాగడానికి చాలా మంది ఇష్టపడతారు. వీటిలో ముఖ్యంగా టమాటా, చికెన్ సూప్‌ను ఎక్కువ మంది తాగుతూ ఉంటారు. అయితే ఈ రెండింటిలో ఏ సూప్ మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అనే విషయం తెలియక ప్రజలు తరచుగా గందరగోళం చెందుతారు. కాబట్టి ఆరోగ్యానికి ఏ సూప్ మంచిది, ఎందుకో తెలుసుకుందాం పదంది.

Tomato vs Chicken Soup: టమాటా సూప్ లేదా చికెన్ సూప్.. రోగనిరోధక శక్తికి, చర్మాన్ని మెరిసేలా చేసేందుకు ఏది బెస్ట్!
Chicken Soup Vs Tomato Soup

Updated on: Jan 30, 2026 | 6:46 PM

శీతాకాలంలో సూప్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే జనాలు ఎక్కువగా సూప్ తాగేందుకు ఇష్టపడుతారు. చలికాలంలో సూప్ తాగడం వల్ల అది శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా, అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది. మనసుకు ప్రశాంతంగా ఉంచుతుంది. అయితే సూప్‌ల విషయానికి వస్తే కొంతమంది చికెన్ సూప్‌ను ఇష్టపడతే, మరికొందరు టమోటా సూప్‌ను ఇష్టపడుతారు. కాబట్టి రెండింటి ప్రయోజనాలు చూసుకుంటే

చికెన్ సూప్‌లో పోషకాలు, ప్రయోజనాలు

ఒక కప్పు చికెన్ నూడిల్ సూప్‌లో 100–150 కేలరీలు, 6–10 గ్రాముల ప్రోటీన్ 500 mg నుండి 1500 mg కంటే ఎక్కువ సోడియం ఉంటాయి. ఇంట్లో తయారుచేసిన చికెన్ సూప్ లీన్ ప్రోటీన్, బి విటమిన్లు, జింక్ వంటి పోషకాలను అందిస్తుంది, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. అయితే, అన్ని చికెన్ సూప్‌లు ఒకేలా ఉండవు. మార్కెట్‌లో లభించే కొన్నింటిలో అధిక సోడియం ఉంటుంది, ఇది రక్తపోటును ప్రభావితం చేస్తుంది. కాబట్టి, మార్కెట్ నుండి సూప్ కొనేప్పుడు సోడియం కంటెంట్‌ను చెక్‌ చేసుకోవడం ఉత్తమం. అలాగే, ఇంట్లో సూప్ తయారుచేసేటప్పుడు, లీన్ చికెన్, తాజా కూరగాయలు వాటి తేలికపాటి రసంతో తయారు చేసుకోండి.

టమాటో సూప్‌లో పోషకాలు, ప్రయోజనాలు

ఒక కప్పు టమాటో సూప్‌లో సాధారణంగా 70–150 కేలరీలు ఉంటాయి. ఇందులో లైకోపీన్, విటమిన్లు ఎ మరియు సి ఉంటాయి, ఇవి కంటి ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే, టమాటో సూప్‌లో చికెన్ సూప్ కంటే ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. టమాటో సూప్‌లో విటమిన్ సి, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తాయి. చికెన్ సూప్ లాగానే, టమాటో సూప్‌లో సోడియం, చక్కెర కంటెంట్‌ను గుర్తుంచుకోవడం ముఖ్యం.

రెండింటిలో ఏది మంచిది?

రెండూ సూప్‌లు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ చికెన్ సూప్ ప్రోటీన్, తృప్తికి మంచిది. టొమాటో సూప్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, ఇందులో ప్రోటీన్ తక్కువగా ఉంటుంది, కాబట్టి సమతుల్య ఆహారాన్ని నిర్వహించడానికి ప్రోటీన్ అధికంగా ఉండే సైడ్ డిష్‌తో కలిపి తీసుకోవడం మంచింది. మీకు గొంతు నొప్పి, జలుబు లేదా బలహీనమైన శరీరం ఉంటే, చికెన్ సూప్ చాలా బెటర్

అలా కాకుండా మీరు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవాలనుకుంటే, శీతాకాలంలో మీ చర్మాన్ని పొడిబారకుండా కాపాడుకోవాలనుకుంటే, మీ ఆహారంలో టమోటా సూప్‌ను చేర్చుకోండి. మీరు కావాలనుకుంటే, రెండు సూప్‌లను ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు, ఇది మీ శరీరానికి ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు రెండింటినీ అందిస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.