Chia Seeds vs Pumpkin Seeds: చియా Vs గుమ్మడి.. ఆరోగ్యానికి ఏ గింజలు బెస్ట్..? తప్పక తెలుసుకోండి..

చియా సీడ్స్, గుమ్మడి గింజలు రెండూ సూపర్ ఫుడ్సే.. రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ దేనిని ఎంచుకోవాలి..? మీ శరీరానికి ఏది అవసరం..? గుండె ఆరోగ్యం, జీర్ణశక్తి, కండరాల బలం, మరియు మంచి నిద్ర కోసం ఏ గింజలు మేలు చేస్తాయి అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Chia Seeds vs Pumpkin Seeds: చియా Vs గుమ్మడి.. ఆరోగ్యానికి ఏ గింజలు బెస్ట్..? తప్పక తెలుసుకోండి..
Chia Seeds Vs Pumpkin Seeds

Updated on: Oct 10, 2025 | 7:01 AM

ఈ మధ్యకాలంలో చాలా మంది ఆరోగ్యంపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. గతంలో ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోని వారు సైతం ఇప్పుడు హెల్త్ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రోజుల్లో ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే ఆహారాలలో చియా సీడ్స్, గుమ్మడి గింజలు ముందున్నాయి. అయితే చాలా మందికి ఈ రెండింటిలో ఏది ఉత్తమమో అనే డౌట్ ఉంటుంది. సాధారణంగా ఈ రెండు గింజలు అద్భుతమైన పోషకాలను కలిగి ఉన్నప్పటికీ వాటి లాభాలు వేర్వేరుగా ఉంటాయి. మీ ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా సరైన గింజలను ఎంచుకోవచ్చు.

చియా సీడ్స్ బెనిఫిట్స్ :

మీరు మీ డైట్‌లో ఫైబర్ శాతాన్ని పెంచుకోవాలని చూస్తున్నట్లయితే.. చియా సీడ్స్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే చియా గింజల్లో గుమ్మడి గింజల కంటే ఏకంగా ఐదు రెట్లు ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఈ అధిక ఫైబర్ కారణంగా ఇవి త్వరగా కడుపు నిండిన అనుభూతిని ఇచ్చి.. బరువు నియంత్రణ, జీర్ణక్రియ మెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. వీటితో పాటు చియా గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు మంచి వనరు. ఈ ఒమేగా-3లు మీ గుండె ఆరోగ్యం, మెదడు పనితీరుకు కీలకం. అంతేకాక ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం కూడా వీటిలో ఎక్కువగా ఉంటుంది. అందుకే గ్లైసెమిక్ నియంత్రణ, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకునే వారికి చియా గింజలు చాలా మేలు చేస్తాయి.

ప్రోటీన్, మెగ్నీషియంకు గుమ్మడి

మీరు కండర బలం, నరాల పనితీరు, మంచి నిద్రపై దృష్టి సారిస్తున్నట్లయితే గుమ్మడి గింజలు గొప్ప ఎంపిక. వీటిలో చియా గింజల కంటే ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది. ఇది శరీర కణాల మరమ్మత్తుకు, కండరాల నిర్మాణానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా గుమ్మడి గింజల్లో అత్యధికంగా మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం నరాలు, కండరాల పనితీరుకు సపోర్ట్ ఇవ్వడంతో పాటు రక్తపోటును నియంత్రిస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. అదనంగా వీటిలో ఉండే విటమిన్ E యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి ప్రోటీన్, మెగ్నీషియంతో పాటు నిద్ర నాణ్యత మెరుగుదల కోరుకునే వారికి గుమ్మడి గింజలు చాలా విలువైనవి.

ఏది ఎంచుకోవాలి..?

వాస్తవానికి రెండింటి మధ్య దేనినో ఒకదాన్ని ఎంచుకోవడం కంటే.. మీ రోజువారీ ఆహారంలో రెండింటినీ చేర్చుకోవడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధంగా మీరు చియా గింజల నుండి ఫైబర్, ఒమేగా-3 లను, అలాగే గుమ్మడి గింజల నుండి ప్రోటీన్, మెగ్నీషియంను పొందగలుగుతారు. అయితే చియా గింజలను నానబెట్టి లేదా పెరుగు, స్మూతీస్ వంటి ద్రవ పదార్థాలలో కలిపి తినడం మంచిది. ఎందుకంటే వాటిని నేరుగా పొడిగా తినడం కొన్నిసార్లు ప్రమాదకరం కావచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..