Health Tips: అనుకోకుండా మింగిన చూయింగ్ గమ్ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

|

Jun 26, 2024 | 7:24 AM

చాలా మంది తమకు తెలియకుండానే చూయింగ్ గమ్‌ను మింగేస్తారు. అయితే, చూయింగ్ గమ్ మింగడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా? ఇది ఏదైనా శరీర భాగాలను ప్రభావితం చేస్తుందా..? అనేది చాలా మందిని వేధించే ప్రశ్న. చూయింగ్ గమ్ వల్ల కలిగే అనర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: అనుకోకుండా మింగిన చూయింగ్ గమ్ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
Chewing Gum Swallowed
Follow us on

పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చూయింగ్ గమ్ నమలడానికి ఇష్టపడతారు. కొందరు దవడ వ్యాయామం, దంతాల బలం, నోటి శుభ్రత, దుర్వాసన దూరం చేసుకోవటం కోసం తింటారు. మరికొందరు టైమ్‌ పాస్ కోసం దీనిని తింటుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో చాలా మంది తమకు తెలియకుండానే చూయింగ్ గమ్‌ను మింగేస్తారు. అయితే, చూయింగ్ గమ్ మింగడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా? ఇది ఏదైనా శరీర భాగాలను ప్రభావితం చేస్తుందా..? అనేది చాలా మందిని వేధించే ప్రశ్న. చూయింగ్ గమ్ వల్ల కలిగే అనర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం.

చూయింగ్ గమ్‌ని మింగడం వల్ల కడుపులోకి వెళ్లిన తర్వాత అది పేగులకు అడ్డుపడతాయని అంటున్నారు. చూయింగ్ గమ్ సుమారు 7 సంవత్సరాల పాటు కడుపులో ఉంటుందని చెబుతారు. అయితే ఈ వాదనలో ఎలాంటి వాస్తవం లేదని నిపుణులు స్పష్టం చేశారు.

చూయింగ్ గమ్ జీర్ణంకాదని అంటారు. ఎందుకంటే.. ఇది కరగని పదార్థంతో తయారైంది. అయితే, అది పొరపాటున మింగినట్లయితే అది గంటల్లో లేదా రోజుల తర్వాత మలం ద్వారా బయటకు వెళుతుందని చెబుతున్నారు. కానీ, చూయింగ్ గమ్ ఎక్కువగా తినటం మంచింది కాదు. పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలంటున్నారు. చూయింగ్ గమ్ మీ జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇది ఆరోగ్యానికి హానికరం.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..