Health Tips: కాసేపయ్యాక వేళ్దాంలే అని మూత్రం ఆపుకుంటున్నారా? ఈ వార్నింగ్ మీకే!

Edited By:

Updated on: Feb 26, 2026 | 5:39 PM

ఈ మధ్య కాలంలో పనిలో పడి చాలా మంది తమ ఒంటిపై కూడా శ్రద్ధ పెట్టడం లేదు. మరికొందరైతే ఏకంగా పని పేరుతో మూత్రాన్ని కూడా ఆపుకుంటున్నారు. అలాగే ప్రయాణాల్లో పరిస్థితి అనుకూలంచడం లేదనో.. పరిసరాలు శుభ్రంగా లేవనో, అసలు టాయిలెట్సే లేవనే కారణంతో కూడా కొందరు ఈ అలవాటును కొనసాగిస్తున్నారు. కానీ ఇలా మూత్ర విసర్జన ను నియంత్రిస్తే కలిగే అనర్థాలు ఏంటి.. భవిష్యత్‌లో ఆరోగ్యంపై పడే ప్రభావం గురించి ఎవరూ ఆలోచించడం లేదు. కాబట్టి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 6
ప్రజెంట్ డేస్‌లో జనాలు ఎంత బిజీగా అయిపోయారంటే..కనీసం టాయిలెట్‌కు వెళ్లేందుకు కూడా సమయం లేనంతగా జీవితం గడిపేస్తున్నారు. కొందరైతే ఏకండా పనిలో పడి మూత్రాన్ని కూడా ఆపుకుంటూ ఉంటారు. కానీ అలా చేయడం చాలా ప్రమాదకరం అంటున్నారు వైద్యులు. ఈ అలవాటు మూత్ర నాళాన్ని దెబ్బతీయడమే కాకుండా అనేక తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుందని చెపుతున్నారు.

2 / 6
మన శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్, హానికరమైన బ్యాక్టీరియా, అదనపు ఉప్పు మూత్రం ద్వారా బయటకు విసర్జించబడుతుంది. అయితే.. ఆ మూత్రాన్ని విసర్జన‌ చేయకుండా ఆపుకోవడం అంటే అనారోగ్యానికి ఆహ్వానం పలికి నట్టే అంటున్నారు వైద్యులు. హా.. తర్వాత వెళ్లొచ్చులే.. కాసేపే కదా మూత్రాన్ని ఆపుకుంటే ఏం కాదులే అనే ఆలోచనే అసలు ప్రమాదం అంటున్నారు. అలాంటి నిర్ణయం మన మూత్రపిండాల వ్యవస్థను నిశ్శబ్దంగా దెబ్బతీస్తుందని చెపుతున్నారు వైద్యులు.

3 / 6
మూత్రాశయం నిండినప్పుడు.. మెదడు మూత్రాన్ని విడుదల చేయమని సందేశాన్ని ఇస్తుంది. అలాంటి సమయంలో మూత్రాన్ని నియంత్రిస్తే మన శరీరంలో అనేక దుష్ప్రభావాలు కలిగుతాయంట. మూత్రాన్ని బలవంతంగా ఆపుకోవడం వల్ల మూత్రశయంపై అధిక ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది మూత్రాశయం కండరాల్ని బలహీనపరుస్తుంది. దీని కారణంగా మూత్రాశయం అతిగా సాగడం వల్ల దాని కండరాల పటుత్వం తగ్గిపోతుంది.

4 / 6
మూత్రాన్ని పదేపదే ఆపుకోవడం వల్ల మూత్రాశయంలో చెడు బ్యాక్టీరియా పేరుకుపోతుంది. ఇది క్రమంగా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. దీంతో మూత్రంలో మంట, దుర్వాసన తో కూడిన మూత్రం.. ఆ కారణంగా అనారోగ్యం పాలవడం జరుగుతుంది. జ్వరం రావడం.. ఆ జ్వరం తీవ్రమవడం.. దాని కారణంగా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌ జరుగుతుంది.

5 / 6
మూత్రాన్ని బలవంతంగా ఆపుకోవడం కారణంగా కిడ్నీల్లో రాళ్లు  ఏర్పడతాయి. పదే పదే మూత్ర విసర్జన ఆపుకోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. కిడ్నీల్లో రాళ్లు తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఎక్కువ సమయం యూరిన్ ఆపుకోవడం వల్ల మూత్రపిండాలపై మూత్ర ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఇది హైడ్రోనెఫ్రోసిస్ లేదా మూత్రపిండాల ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. కారణంగా మూత్రపిండాల వైఫల్యం కూడా జరిగే ప్రమాదం ఉంటుంది.

6 / 6
మూత్రాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రక్షణ చర్యలు తప్పని సరి. రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీరు తాగడం ఉత్తమం అంటున్నారు వైద్యులు. దాహం వేసినా వేయకపోయినా కనీసం ప్రతి 3 గంటలకో సారి మూత్రవిసర్జన చేయడానికి ప్రయత్నించమని సలహా ఇస్తున్నారు. పని ఒత్తిడిలో పడి మూత్రాన్ని ఆపుకుంటే పైన పేర్కొన్న ప్రమాదాల భారీన పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఇక నుండి ఎంత అత్యవసరం ఉన్నా మూత్రాన్ని మాత్రం కట్టడి చేయకండి. అలా చేస్తే అనారోగ్యాన్ని ఉచితంగా కొనుగోలు చేసిన వారవుతారు తస్మాత్ జాగ్రత్త. Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు.

Follow Us