Washing Machines: టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌లో ఫ్రంట్ లోడ్ డిటర్జెంట్ వేస్తే ఏమవుతుంది?

వాషింగ్ మెషీన్ వాడేవారిలో చాలా మంది ఎదుర్కొనే సమస్య ఇది. కొన్నిసార్లు మెషీన్ కోసం డిటర్జెంట్ లిక్విడ్ కొనేటప్పుడు పొరపాటున టాప్ లోడ్ కి బదులు ఫ్రంట్ లోడ్, ఫ్రంట్ లోడ్ కి బదులు టాప్ లోడ్ లిక్విడ్ కొనేస్తారు. ఇలా మెషిన్ అవసరాలకోసం ప్రత్యేకంగా తయారుచేసిన లిక్విడ్ ను వాడకుండా మరో లిక్విడ్ వాడితే ఏమవుతుంది? ఇది మీ మెషిన్, బట్టలకు ఏదైనా హాని కలిగిస్తుందా అని కంగారు పడుతున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి.

Washing Machines: టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌లో ఫ్రంట్ లోడ్ డిటర్జెంట్ వేస్తే ఏమవుతుంది?
Front Load Liquid On Top Load Washing Machine

Updated on: Apr 20, 2025 | 9:13 PM

వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతకడం ఇంట్లో సాధారణ పని. కానీ, కొత్తగా ఈ మిషన్ ను వాడేవారికి దీనిని వాడే పద్ధతి పెద్ద సమస్యగా మారుతుంది. మారుతున్న టెక్నాలజీ అవసరాలకు తగ్గట్టుగా వాషింగ్ మెషీన్స్ లో ఎక్నో కొత్త సౌలభ్యాలు వస్తున్నాయి. రోజుకో కొత్త ఆప్షన్ తో మెషీన్లు రూపుదిద్దుకుంటున్నాయి. కొన్నాళ్ల కిందట టాప్ లోడ్ మెషీన్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఫ్రంట్ లోడ్ మెషీన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటే ఇందులో వాడే డిటర్జంట్ లిక్వడ్లు కూడా వేరు వేరుగా లభిస్తున్నాయి. మరింతకీఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌ల కోసం తయారు చేసిన లిక్విడ్ డిటర్జెంట్‌ను టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌లో వాడవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఇలా వాడితే ఏమవుతుందో తెలుసుకుందాం..

1. తక్కువ నురగ ఉత్పత్తి

ఫ్రంట్ లోడ్ డిటర్జెంట్‌లు హై-ఎఫిషియెన్సీ(హెచ్ఈ) వాషింగ్ మెషీన్‌ల కోసం రూపొందించబడ్డాయి. ఇవి సాధారణ డిటర్జెంట్‌లతో పోలిస్తే తక్కువ నురగను ఉత్పత్తి చేస్తాయి. టాప్ లోడ్ మెషీన్‌లు, ముఖ్యంగా హెచ్ఈ కానివి, ఎక్కువ నురగతో బట్టలను శుభ్రం చేయడానికి రూపొందించి ఉంటాయి. అందుకే, ఫ్రంట్ లోడ్ డిటర్జెంట్ వాడినప్పుడు ఎక్కువ నురగ కనిపించదు. అయినప్పటికీ, ఇది బట్టలను ఉతికి జాడించడంలో పవర్ఫుల్ గా పనిచేస్తుంది.

2. డిటర్జెంట్ మోతాదు

ఫ్రంట్ లోడ్ డిటర్జెంట్‌లు ఎక్కువ ఎఫీషియెంట్ గా పనిచేస్తాయి. అంటే తక్కువ మొత్తంలో వాడినప్పటికీ ఎక్కువ శుభ్రత ఇస్తాయి. టాప్ లోడ్ మెషీన్‌లో వాడేటప్పుడు, ముఖ్యంగా టాప్ లోడ్ మెషీన్‌లలో, కొంచెం ఎక్కువ మోతాదు అవసరం కావచ్చు. డిటర్జెంట్ బాటిల్‌పై టాప్ లోడ్ మెషీన్‌ల కోసం సూచించిన మోతాదును ముందుగా చెక్ చేసుకోవాలి. ఇలా చూసుకోకుండా కొంటే తర్వాత ఇబ్బందిపడతారు.

3. హెచ్ ఈ మెషీన్‌లకు అనువైనది

ఒకవేళ మీ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ హై-ఎఫిషియెన్సీ(హెచ్ఈ) మోడల్ అయితే, ఫ్రంట్ లోడ్ డిటర్జెంట్ దీనికోసం కూడా వాడుకోవచ్చు. హెచ్ఈ మెషీన్‌లు తక్కువ నీటిని, తక్కువ నురగను ఉపయోగిస్తాయి. మీ మెషీన్‌పై “హెచ్ఈ గుర్తు ఉందా అని చెక్ చేసుకుంటే మీరు రెండింటిలో ఈ ఒకే లిక్విడ్ వాడుకోవచ్చా లేక వేరు వేరుగా వాడాల్సి ఉంటుందా అనే విషయం తెలిసిపోతుంది.

4. శుభ్రత సామర్థ్యం

ఫ్రంట్ లోడ్ డిటర్జెంట్‌లు టాప్ లోడ్ మెషీన్‌లలో కూడా సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇవి వివిధ నీటి స్థాయిలలో, పరిస్థితులలో బట్టలను శుభ్రం చేయగలవు. అయితే, ఎక్కువ డిటర్జెంట్ వాడకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఎందుకంటే అది బట్టలపై లేదా మెషీన్‌లో డిటర్జెంట్ మరకలను అంటుకునేలా చేస్తుంది.

ఈ చిట్కాలు పనిచేస్తాయి..

మీ టాప్ లోడ్ మెషీన్ పాతది అయ్యుండి.. హెచ్ ఈ కానిది అయితే, ఫ్రంట్ లోడ్ డిటర్జెంట్ వాడినప్పుడు అదెలా శుభ్రం చేస్తుందో గమనించండి. ఒకవేళ అవసరం అనుకుంటే ఈ మోతాదును అడ్జస్ట్ చేసుకోండి.

ఎక్కువ డిటర్జెంట్ వాడడం వల్ల మెషీన్‌లో లేదా బట్టలపై మరకలు ఏర్పడవచ్చు, కాబట్టి సరైన మోతాదు వాడండి.

బట్టల సంఖ్య, మెషీన్ సామర్థ్యం ఆధారంగా డిటర్జెంట్ మోతాదును నిర్ణయించండి.