Breast Cancer: ఈ ఆహారాలు తింటే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదం 20 శాతం ఎక్కువ

|

Jul 25, 2022 | 5:56 PM

మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలోస్కిన్ క్యాన్సర్ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. DNA దెబ్బతినడం వల్ల రొమ్ము క్యాన్సర్ మహిళల్లో అభివృద్ధి చెందుతుంది. నిజానికి.. రొమ్ము క్యాన్సర్‌కు అనేక కారణాలు ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వాటిల్లో అనారోగ్యకరమైన ఆహారం కూడా ఒకటి...

Breast Cancer: ఈ ఆహారాలు తింటే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదం 20 శాతం ఎక్కువ
Breast Cancer
Follow us on

Breast Cancer in Women: మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలోస్కిన్ క్యాన్సర్ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. DNA దెబ్బతినడం వల్ల రొమ్ము క్యాన్సర్ మహిళల్లో అభివృద్ధి చెందుతుంది. నిజానికి.. రొమ్ము క్యాన్సర్‌కు అనేక కారణాలు ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వాటిల్లో అనారోగ్యకరమైన ఆహారం కూడా ఒకటి. బ్రెస్ట్ క్యాన్సర్ ఇండియా నివేదికల ప్రకారం.. ప్రతి 4 నిమిషాలకు ఒక ఇండియన్‌ ఉమెన్‌ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతుండగా, ప్రతి 8 నిమిషాలకు ఒకరు రొమ్ము క్యాన్సర్‌తో మరణిస్తున్నట్లు వెల్లడించింది. సాధారణంగా ఊబకాయం, జన్యు, కుటుంబ నేపథ్యం ఉన్నవాళ్లకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే అధిక మద్యపానం, రేడియేషన్, పోస్ట్ మెనోపాజ్ ఆపరేషన్లు, పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం వంటి వాటి వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ ప్రమాదం ఎక్కువే. ఐతే తాజా అధ్యయనాల్లో బయటపడిందేమిటంటే.. వంశపారంపర్యంగానేకాకుండా జీవనశైలి కారణంగా కూడా రొమ్ము క్యాన్సర్ తలెత్తే ప్రమాదం ఉన్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ 20 శాతం పెరుగుతుందని వెల్లడించారు. మొక్కల ఆధారిత ‘అనారోగ్యకరమైన’ ఆహారం తీసుకునే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువట. అంటే ప్రాసెస్ చేసిన బియ్యం, పిండి, బ్రెడ్‌ వంటి వాటివల్ల ఈ వ్యాధి భారీన పడుతున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి.

అధ్యయనంలో భాగంగా మెనోపాజ్ ప్రారంభమైన 65 వేల మంది మహిళలను దాదాపు 20 ఏళ్లపాటు.. వారి ఆహార ఎంపికల ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకునేవారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 14 శాతం తక్కువగా ఉందని, అదేవిధంగా ప్లాంట్‌ బేస్డ్‌ అన్‌హెల్తీ పుడ్‌ తీసుకున్న మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం 20 శాతం ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.

కార్బోహైడ్రేట్లు ఆరోగ్యంపై ఏ విధంగా ప్రభావం చూపుతాయి..

ఇవి కూడా చదవండి

ఆహారంలో కార్బోహైడ్రేట్ల పరిమాణాన్ని తగ్గిస్తే రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. బంగాళదుంపలు, చక్కెర పానియాలు, పండ్ల రసాలలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఈ క్రమంలో కార్బోహైడ్రేట్లు ప్రమాదకరమా? వాటిని అసలు తీసుకోకూడదా? అనే సందేహం తలెత్తవచ్చు. నిజానికి కార్బోహైడ్రేట్లు తక్షణ శక్తి అందించడానికి, కండరాల ఆరోగ్యానికి, జీర్ణ ఆరోగ్యానికి చాలా అవసరం. అలాంటప్పుడు కార్బోహైడ్రేట్లు ఎందుకు ఆరోగ్యానికి ప్రమాదంగా భావిస్తారు?

కార్బోహైడ్రేట్లలో మూడు రకాలున్నాయి. చక్కెర, స్టార్చ్ (పిండి పదార్ధాలు), ఫైబర్. చక్కెరను సాధారణ కార్బోహైడ్రేట్ అంటారు. ఇది స్వీట్లు, ప్రాసెస్ చేసిన ఆహారం, కూల్‌ డ్రింక్స్‌ వంటి వాటిల్లో అధికంగా ఉంటుంది. పిండి పదార్ధాల్లో ఉండేవి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు. అంటే సాధారణ చక్కెరలు ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన చక్కెర. ఇక ఫైబర్ కూడా ఒకరకమైన సంక్లిష్ట కార్బోహైడ్రేట్. దీనిని జీర్ణం చేసుకోవడం చాలా కష్టం. పీచు పదార్థాలు తీసుకున్న తర్వాత చాలా సేపటి వరకు ఆకలి వేయకుండా ఉండటానికి ఇదే కారణం.

రొమ్ము క్యాన్సర్‌ను నివారించే మార్గాలు
పిల్లలకు తల్లిపాలు పట్టించడం, బరువును అదుపులో ఉంచుకోవడం, మద్యం సేవించకపోవడం, పొగాకు తాగకపోవడం, అధిక రేడియేషన్‌కు దూరంగా ఉండటం.