శీతాకాలపు రక్షణ కవచాలు.. ఈ మూడు మీ ఆహారంలో ఉంటే.. ఆ సమస్యకు చూమంత్రం వేసినట్టే!

Boost Winter Immunity Naturally: శీతాకాలం వచ్చింటే చాలా తరచూ జనాలు అనారోగ్యం భారీన పడుతూ ఉంటారు. ఇందకు ప్రధాన కారణం రోగనిరోధక శక్తి తగ్గడం. దీనిని తగ్గకుండా చూసుకోవడం కోసం మన రోజువారీ ఆహారంతో పాటు, శరీరానికి మరిన్ని పోషకాలు అవసరం. అలాంటి సందర్భంలో మన వంటిట్లో దొరికే ఈ మూడు పదార్థాలు మీరు ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచడంతో పాటు శరీరానికి తగినంత శక్తిని అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంతకూ అవేంటో తెలుసుకుందాం పదండి.

శీతాకాలపు రక్షణ కవచాలు.. ఈ మూడు మీ ఆహారంలో ఉంటే..  ఆ సమస్యకు చూమంత్రం వేసినట్టే!
Turmeric, Jaggery And Pepper Benefits

Updated on: Dec 30, 2025 | 4:42 PM

శీతాకాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ప్రధాన సమస్యలు జలుబు, దగ్గు, జ్వరం, ఈ సమస్యలతో పోరడడానికి మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. దీన్ని పెంచుకునేందుకు మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో మనకు పసుపు, బెల్లం, నల్ల మిరియాలు ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. శాస్త్రవేత్తలు ఈ మూడింటిపై అధ్యయనం చేసి ఇవి శీతాకాలంలో మన శరీరానికి రక్షణ కవచాలుగా పనిచేస్తాయని పేర్కొన్నారు. వీటిలో ఉండే పోషకాలు అనేక రకాల వ్యాధుల నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయని తెలిపారు.

పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు

పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయని, ఇవి శరీరానికి వెచ్చగా ఉంచి.. శక్తిని అందిస్తాయని తెలిపారు. అంతేకాదు ఇవి జలుబు, దగ్గును కూడా నివారించంచగలవని తెలిపారు. కీళ్ల నొప్పులను తగ్గించడానికి ,చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన పదార్థం అని తెలిపారు.

నల్ల మిరియాల వల్ల కలిగే ప్రయోజనాలు

నల్ల మిరియాలలో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే మన శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది చర్మ సంరక్షణలో కూడా సహాయపడుతుంది. దీంతో పాటు కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.

బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలు

శీతాకాలంలో బెల్లం తినడం వల్ల శరీరం లోపలి నుండి వెచ్చగా ఉంటుంది. జలుబు ,దగ్గును నివారించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరానికి శక్తిని ఇవ్వడానికి ఇది అద్భుతమైనది. బెల్లంలో ఇనుము, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శీతాకాలంలో జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఇలా ఆహారంలో చేర్చుకోండి

మీరు ఈ మూడు పదార్థాలను మీ రోజువారీ ఆహారంలో విడిగా చేర్చుకోవచ్చు. లేదా పసుపు, బెల్లం, నల్ల మిరియాలను పొడిగా చేసి దానిని వేడి నీటిలో కలుపుకొలి కూడా తాగవచ్చు. ఇందుకోసం ఒక కప్పు పాలు లేదా నీటిని వేడి చేసి అందులో అర టీస్పూన్ పసుపు, చిటికెడు నల్ల మిరియాలు పొడి, కాస్త బెల్లం కలిపి వేడిగా మరిగించి తాగండి, ఇది జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

(గమనిక: పైన పేర్కొన్న అంశాలు నివేదికలు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా మాత్రమే అందించబడింది. వీటిపి టీవీ9 దృవీకరించడం లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.