Health Tips: పవర్‌కి పవర్.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. స్త్రీ, పురుషుల్లో సంతాన సామర్థ్యాన్ని పెంచే పండ్లు ఇవే..

ఉరుకులు పరుగులు ఆధునిక జీవితంలో చాలా మంది ఫెర్టిలిటీ సమస్య (సంతానలేమి) తో బాధపడుతున్నారు. చాలామంది పెళ్లైన కొన్నేకు కూడా పిల్లలు కలగకపోవడం.. లేదా ఇతర అనారోగ్య సమస్యలు.. లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.. అయితే.. కొన్ని సహజ సిద్ధమైన పండ్లతో కూడా స్టామినాను పెంచుకోవచ్చని.. వంధత్వాన్ని దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Health Tips: పవర్‌కి పవర్.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. స్త్రీ, పురుషుల్లో సంతాన సామర్థ్యాన్ని పెంచే పండ్లు ఇవే..
Health Tips

Updated on: Jan 29, 2026 | 4:14 PM

ఉరుకులు పరుగులు ఆధునిక జీవితంలో చాలా మంది ఫెర్టిలిటీ సమస్య (సంతానలేమి) తో బాధపడుతున్నారు. చాలామంది పెళ్లైన కొన్నేకు కూడా పిల్లలు కలగకపోవడం.. లేదా ఇతర అనారోగ్య సమస్యలు.. లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.. ఫెర్టిలిటీ అంటే పిల్లలను కనే సహజ సామర్థ్యం.. సంతానలేమి (ఇన్ ఫెర్టిలిటీ) అంటే.. పెళ్లైన ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు గర్భనిరోధక సాధనాలు వాడకుండా క్రమబద్ధమైన శారీరక కలయిక ఉన్నపటికీ గర్భం దాల్చకపోవడం.. ఇది స్త్రీ లేదా పురుషులలో.. లేదా ఇద్దరిలో ఏదో ఒక లోపం ఉండవచ్చు.. వయస్సు, వంధత్వం, జీవనశైలి, ఆహారం, వైద్య పరిస్థితులు సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.. వంధత్వంతోపాటు.. పురుషులలో వీర్యకణాల లోపం, స్త్రీలలో అండాల ఉత్పత్తి లోపం వంటివి ప్రధాన కారణాలని చెబుతున్నారు. అయితే.. కొన్ని సహజ సిద్ధమైన పండ్లతో కూడా స్టామినాను పెంచుకోవచ్చని.. వంధత్వాన్ని దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లతో ఫెర్టిలిటీ సామర్థ్యం పెరుగుతుందని పేర్కొంటున్నారు.

స్త్రీ-పురుషుల్లో సంతాన సామర్థ్యాన్ని పెంచే పండ్లు ఇవే..

అవకాడో: ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E, ఫోలేట్‌తో నిండి ఉంటుంది.. ఇది అండాల నాణ్యతను, స్పెర్మ్ నాణ్యతను మెరుగు చేస్తుంది.

బ్లూ బెర్రీస్‌: వీటిలోని ఆంథోసైనిన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు.. ఫ్రీ రాడికల్స్‌ నుంచి గర్భాశయం, శక్రకణాల‌ను రక్షిస్తాయి.

దానిమ్మ: విటమిన్ సీ, ఫోలేట్ వంటి పోషకాలతో టెస్టోస్టెరాన్‌ స్థాయిలను పెంచి, స్పెర్మ్‌ నాణ్యతను మెరుగుపరుస్తుంది.

నారింజ: విటమిన్ సీతో నిండి, శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది.. ఇంకా శక్తిని పెంచుతుంది.

అరటిపండు: విటమిన్ B6 వల్ల హార్మోన్ల సమతుల్యాన్ని ఉంచి సంతాన ఆరోగ్యానికి సహాయపడుతుంది.

కివీ: కివీలోని విటమిన్ సీ, ఈ.. శరీరంలో ఫెర్టిలిటీకి అవసరమైన పోషకాలను అందిస్తాయి..

జామపండు: పోషకాలతో నిండి ఉన్న జామ.. అండాలు, స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

స్ట్రాబెర్రీస్‌: యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఫెర్టిలిటీని మెరుగుపరుస్తాయి.

టమాటా: లైకోపీన్‌తో నిండి ఉంది.. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేసి స్పెర్మ్‌ నాణ్యతకు మేలు చేస్తుంది.

ఈ పండ్లు సంతాన సామర్థ్యాన్ని పెంచుతాయి.. అయితే.. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం, సరైన సమయంలో వైద్యులను సంప్రదించడం ద్వారా సంతానోత్పత్తిని కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏమైనా సమస్యలుంటే.. ఆరోగ్య నిపుణులను సంప్రదించి వారు చెప్పిన విధంగా చికిత్స పొందడం ఉత్తమం..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..