Black Coffee : బ్లాక్ కాఫీ ఎక్కువగా తాగితే ఏమవుతుందో తెలుసా..?

|

Jan 10, 2024 | 7:17 AM

బ్లాక్ కాఫీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు లేదా దుష్ప్రభావాల గురించి చాలా మందికి తెలియదు. బ్లాక్ కాఫీని మితంగా తాగడం వల్ల సమస్యలు రావు.. కానీ, అధిక వినియోగం జీవనశైలిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాఫీ గింజల్లో ఉండే కెఫీన్ అనే ఉద్దీపన పదే పదే కాఫీ తాగాలనిపిస్తుంది. ఎక్కువగా కాఫీ తాగడం వల్ల కెఫిన్ అధిక మొత్తంలో శరీరంలోకి చేరుతుంది. ఇది..

Black Coffee : బ్లాక్ కాఫీ ఎక్కువగా తాగితే ఏమవుతుందో తెలుసా..?
Black Coffee
Follow us on

ఉదయాన్నే ఒక కప్పు కాఫీతో రోజు ప్రారంభించడం చాలా మంది అలవాటు. కొంతమందికి పొద్దునే లేవగానే కాసింత కాఫీ గొంతులో పడనిదే బెడ్ కూడా దిగబుద్ది కాదు. ఒత్తిడిగా అనిపించినప్పుడు కూడా మరికొంతమంది కాఫీ తాగి రిఫ్రెష్ అవుతారు. కాఫీలో యాంటీఆక్సిడెంట్లు, ప్రయోజనకరమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. అయితే సరైన పద్ధతిలో కాఫీ తీసుకుంటే మీకు అనేక వ్యాధులని కూడా ఇది నయం చేస్తుంది. పాలు, చక్కెర ఉండే కాఫీ కంటే బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అయితే అతిగా తీసుకుంటే.. అమృతం కూడా విషంగా మారుతుందనే అనే సామెతను మాత్రం మర్చిపోవద్దు. బ్లాక్ కాఫీని అతిగా తీసుకోవటం వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తేలింది.

బ్లాక్ కాఫీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు లేదా దుష్ప్రభావాల గురించి చాలా మందికి తెలియదు. బ్లాక్ కాఫీని మితంగా తాగడం వల్ల సమస్యలు రావు.. కానీ, అధిక వినియోగం జీవనశైలిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాఫీ గింజల్లో ఉండే కెఫీన్ అనే ఉద్దీపన పదే పదే కాఫీ తాగాలనిపిస్తుంది. ఎక్కువగా కాఫీ తాగడం వల్ల కెఫిన్ అధిక మొత్తంలో శరీరంలోకి చేరుతుంది. ఇది ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

1. ఎక్కువగా బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళనకు దారి తీయవచ్చు. బ్లాక్ కాఫీ ఎక్కువగా తాగడం వల్ల మీ శరీరం నుంచి ఒత్తిడి హార్మోన్లు అధిక స్థాయిలో విడుదలవుతాయి. ఇది ఆందోళన, ఒత్తిడికి దారితీస్తుంది. అధిక స్థాయిలో కెఫిన్ తీసుకోవడం వల్ల చికాకు పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

2. మీ నిద్రను ప్రభావితం చేస్తుంది: ఎక్కువ కాఫీ తీసుకోవడం వల్ల మీ నిద్రకు భంగం కలుగుతుంది. నిద్రలేమితో అవస్థపడాల్సి వస్తుంది. పడుకునే కొన్ని గంటల ముందు కాఫీకి దూరంగా ఉండటం మంచిది.

3. పొట్టకు హాని కలిగిస్తుంది: బ్లాక్ కాఫీలో కెఫిన్, యాసిడ్ చాలా ఉన్నాయి. కాబట్టి అధిక వినియోగం మీ పొట్టలో ఆమ్లత్వాన్ని కలిగిస్తుంది. మీరు మలబద్ధకం, కడుపు నొప్పిని అనుభవించవచ్చు.

4. శరీరం ద్వారా ఖనిజాల శోషణను అడ్డుకుంటుంది : మీ జీవనశైలిలో కాఫీని అధికంగా తీసుకుంటే, మీ రోజువారీ ఆహారం నుండి ఇనుము, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలను గ్రహించడం శరీరానికి కష్టతరం చేస్తుంది.

అయితే, రోజులో కెఫిన్‌ను 400 మిల్లీగ్రాములకు మించకుండా తీసుకుంటే ఎలాంటి హాని ఉండదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది దాదాపు 4 కప్పుల (960 ml) కాఫీకి సమానం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..