
జీడి మామిడి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ, నల్ల జీడి పండ్ల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఈ పండ్లు కూడా చలికాలంలో ఎక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా గ్రామాలు, అటవీ సమీప ప్రాంతాల్లో ఈ పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. చూసేందుకు నల్లటి ఖర్జూరాలను పోలి ఉంటాయి. రూచి కూడా అద్భుతంగా ఉంటుంది. అప్పుడప్పుడు పట్టణాల్లోనూ వీటిని అమ్ముతుంటారు. ఇంతకీ ఈ పండ్ల ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..
చూసేందుకు నల్లగా ఉండే ఈ జీడిపండ్లు ఆరోగ్యపరంగా దివ్యౌషధంగా ఆయుర్వేదం చెబుతోంది. జీడి పండ్లలో ఉన్న విటమిన్లు, జింక్ , యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనడంలో సహాయపడతాయి. ఈ పండ్లలోని ప్రోయాంటోసైనిడిన్ సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో సహాయపడతాయి. జీడి పండ్లలో ఉన్నమంచి కొవ్వు పదార్థాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ పండ్లలో అధికమైన డైటరీ ఫైబర్ ఉంది, ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
జీడి పండ్లలో లూటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున, ఇవి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. జీడి పండ్లలో ఇనుము ఉన్నందున, ఇది రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. జీడి పండ్లు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి, కాబట్టి వీటిని మీ ఆహారంలో చేర్చడం మంచిది. ఈ పండ్లు తినటం వల్ల దగ్గు, జలుబు, ఆస్తమా వంటి సమస్యను దూరం చేసుకోవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..