Banana Peel Benefits: అరటి తొక్కతో అందం మీ సొంతం.. ఇలా చేసి చూడండి మంచి రిజల్ట్స్‌..

అరటి పండు ఆరోగ్యానికి మంచిదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అరటిలో ఉండే ఎన్నో పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇందులోని పొటాషియం, మెగ్నీషియం, డీ6, బీ 12 విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇదిలా ఉంటే అరటి పండును తిన్న తర్వాత అరటి తొక్కను పాడేయ్యడం..

Banana Peel Benefits: అరటి తొక్కతో అందం మీ సొంతం.. ఇలా చేసి చూడండి మంచి రిజల్ట్స్‌..
Banana Peel Benefits

Updated on: Dec 08, 2022 | 12:03 PM

అరటి పండు ఆరోగ్యానికి మంచిదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అరటిలో ఉండే ఎన్నో పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇందులోని పొటాషియం, మెగ్నీషియం, డీ6, బీ 12 విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇదిలా ఉంటే అరటి పండును తిన్న తర్వాత అరటి తొక్కను పాడేయ్యడం సర్వసాధారణమైన విషయం తెలిసిందే. దాదాపు మనమంతా ఇదే పని చేస్తాం. అయితే అరటి తొక్కతో ఉన్న లాభాలు తెలిస్తే ఇకపై మీరు ఆ పని చేయరు. అరటి తొక్కతో అందం పెంచుకోవచ్చనే విషయం మీకు తెలుసా.? అరటి తొక్కకు, అందానికి మధ్య ఉన్న సంబధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* అరటి తొక్కలో ఉండే కొన్ని రకాల పదార్థాలు మెటిమలను తగ్గిస్తాయి. అరటి తొక్కలోని గుజ్జుని తీసి మొటిమ ఉన్న చోట రాత్రంతా ఉంచితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మొటిమలు తగ్గిపోతాయి. అరటి తొక్కలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇందులో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి. ఇవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. అరటి తొక్కను గ్రైండ్ చేసి ఫేక్‌ ప్యాక్‌ రూపంలో చర్మానికి అప్లై చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

* అరటి తొక్కలో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని యవ్వనంగా మారుస్తాయి. వాటిని గ్రైండ్ చేసి ప్రభావిత చర్మంపై అప్లై చేయడం వల్ల ముడతలు రాకుండా ఉంటాయి. ఇవి చర్మాన్ని సరిచేయడానికి పని చేస్తాయి. అతినీలలోహిత కిరణాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఇవి కూడా చదవండి

* అరటి తొక్కల్లో ఫినాలిక్ సమ్మేళనం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. మీరు అరటిపండు తొక్కలను ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు. ఇది అల్ట్రా వైలెట్ రేడియేషన్ నుంచి మీ చర్మాన్ని రక్షిస్తుంది.

* అరటి తొక్కలో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ ఉంటాయి. ఇది దంతాలను మెరిసేలా చేస్తాయి. ఇందు కోసం అరటి తొక్కను తీసుకొని కాసేపు దంతాలపై రుద్దిత చాలు.

మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..