Mosquito Repellent Plants: దోమలతో పరేషాన్ అవుతున్నారా..? ఈ మొక్కలను ఇంట్లో పెంచండి.. అవి పారిపోతాయి.!

వర్షాకాలం వచ్చిందంటే దోమల బెడద మామూలుగా ఉండదు. అయితే ఇంట్లో దోమల నివారణకు సహజమైన మార్గాలను అన్వేషించేవారు కొన్ని ప్రత్యేకమైన మొక్కలను పెంచడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం పొందవచ్చు. ఈ మొక్కల నుంచి వెలువడే వాసన దోమలకు అసహ్యం కలిగిస్తుందని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఇవి దోమలను ఇంట్లోకి రాకుండా నిరోధించడంలో సహాయపడుతాయి.

Mosquito Repellent Plants: దోమలతో పరేషాన్ అవుతున్నారా..? ఈ మొక్కలను ఇంట్లో పెంచండి.. అవి పారిపోతాయి.!
Mosquito

Updated on: Jun 01, 2025 | 8:15 PM

దోమల సమస్యతో సతమతమవుతున్నారా..? అయితే మీ ఇంట్లో కొన్ని మొక్కలు పెంచడం ద్వారా వాటిని సహజంగా తరిమి కొట్టవచ్చు. ఈ మొక్కల నుంచి వచ్చే ప్రత్యేకమైన వాసన దోమలకు అస్సలు నచ్చదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తులసి మొక్క మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు, దోమలను బాగా తరిమేస్తుంది. తులసి ఆకుల నుంచి వచ్చే ప్రత్యేకమైన ఘాటు వాసన దోమలకు ఇష్టం ఉండదు. అందుకే దోమల సమస్య లేకపోయినా ఇంట్లో తులసిని పెంచడం చాలా మంచిది.

అల్లియం మొక్క ఉల్లిపాయ, వెల్లుల్లి వలెనే పెద్దదిగా పెరుగుతుంది. దీని వాసన కూడా చాలా ఘాటుగా ఉంటుంది. ఈ వాసన దోమలను ఇంటికి చేరనీయకుండా చేస్తుంది. ఇంటి పరిసరాలను కూడా ఆరోగ్యంగా ఉంచడంలో ఈ మొక్క సహాయపడుతుంది.

లావెండర్ వాసన చాలా బలంగా ఉంటుంది. దోమలకు ఇది అసహ్యంగా ఉంటుంది. అందువల్ల ఇంటి తలుపులు, కిటికీల దగ్గర లావెండర్ మొక్కలను పెంచడం ద్వారా దోమలను దూరంగా ఉంచవచ్చు.

సిట్రోనెల్లా మొక్కకు సుగంధమైన, ఘాటు వాసన ఉంటుంది. ఈ వాసన దోమలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇంటి పక్కనే సిట్రోనెల్లా పెంచితే దోమల సమస్య ఎక్కువగా ఉండదు.

పుదీనా మొక్క ఆరోగ్యానికి చాలా మంచిది. కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. దోమలను తరిమికొట్టడంలో కూడా పుదీనా చాలా సహాయపడుతుంది. అందుకనే ఇంట్లో పుదీనాను కుండీలలో పెంచడం చాలా మంచిది.

రోజ్ మేరీని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మొక్క నుంచి వచ్చే వాసన దోమలకు అసహ్యం కలిగిస్తుంది. దోమలతో పాటు ఈగలు కూడా రోజ్ మేరీ వాసనకు దూరమవుతాయి.

సేజ్ మొక్క పుదీనా కుటుంబానికి చెందినది. దీని ఆకులను నిప్పులో కాల్చితే బయటకు వచ్చే పొగ దోమలను, ఈగలను తరిమేస్తుంది. ఈ పద్ధతి సహజంగా దోమల నుంచి మన ఇంటిని రక్షించడంలో ఉపయోగపడుతుంది.

బంతి పూల చెట్టు నుంచి వచ్చే ఘాటు వాసన కూడా దోమల నిరోధకంగా పనిచేస్తుంది. ఈ పూల వాసనను ఉపయోగించి దోమలను దూరం చేయడానికి ప్రత్యేక నూనెలు తయారు చేస్తారు. అందుకే ఇంట్లో బంతి పూల మొక్క పెంచడం చాలా ఉపయోగపడుతుంది.

లెమన్ బామ్ మొక్కకు పుదీనా ఆకారమే ఉంటుంది. కానీ దీని వాసన చాలా బలంగా ఉంటుంది. ఈ వాసన దోమలకు అసహ్యంగా ఉంటుంది. అందువల్ల ఇంట్లో లెమన్ బామ్ ఉంటే దోమల ఉనికి తగ్గిపోతుంది.

ఈ మొక్కలు ప్రతి ఇంట్లో ఉంటే దోమలు అడుగు పెట్టవు. ఇవి సహజసిద్ధమైన, రసాయనాలు లేకుండా పనిచేసే పద్ధతులు కావడంతో మీ ఇంటిని ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచడానికి సహాయపడతాయి.