మీ వయసును అదుపులో ఉంచుకోవటానికి తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాలలో పెరుగు మొదటి స్థానంలో ఉంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మం ముడతలు రాకుండా చేస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
ఈ జాబితాలో ఆరెంజ్ రెండో స్థానంలో ఉంది. బీటా-కెరోటిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే నారింజను క్రమం తప్పకుండా తీసుకోవడం, అలాగే కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడే విటమిన్ సి, మచ్చలను నివారించి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉండే గింజలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ప్రోటీన్, విటమిన్లు, ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉన్న బాదం, ఆరోగ్యకరమైన చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
జాబితాలో చివరిది బెర్రీలు. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.
అంతే కాదు, చక్కరతో తయారు చేసిన స్వీట్స్‌కి దూరంగా ఉండాలి. బెల్లం, తాటిబెల్లం వంటి వాటితో తయారు చేసినవి తీసుకోవచ్చు. చిప్స్, లేదంటే ఉప్పు కోటింగ్ వేసిన స్నాక్స్‌ని బ్రేక్ ఫాస్ట్ గా పొరపాటున కూడా తీసుకోవద్దు.
ఇక నిద్ర విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. సరైన నిద్ర మీ ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. నిద్రపోయే ముందు సెల్‌ఫోన్ వాడకూడదు.