Beauty Tips: మిలమిల మెరిసే ముఖం కోసం శెనగ పిండి.. ఎలా వాడాలో తెలుసా?

రుచికరమైన వంటకాలు తయారుచేయడానికి ఉపయోగించే శెనగ (Besan) పిండిలో కార్బొహైడ్రేట్లు , ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా వివిధ రకాల చర్మ సమస్యలను నిరోధిస్తాయి.

Beauty Tips: మిలమిల మెరిసే ముఖం కోసం శెనగ పిండి.. ఎలా వాడాలో తెలుసా?
Besan Face Mask

Edited By:

Updated on: Feb 24, 2022 | 9:34 AM

రుచికరమైన వంటకాలు తయారుచేయడానికి ఉపయోగించే శెనగ (Besan) పిండిలో కార్బొహైడ్రేట్లు , ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా వివిధ రకాల చర్మ సమస్యలను నిరోధిస్తాయి. ముఖ్యంగా చర్మంలోని మృతకణాలు (Dead cells), విష తుల్య పదార్థాలను తొలగించి ముఖారవిందాన్ని రెట్టింపు చేయడంలో శనగ పిండి బాగా సహాయపడుతుంది. అదేవిధంగా ఇందులో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు మొటిమలు, నల్లమచ్చలు, చర్మం పొడిబారడం తదితర సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే శెనగ పిండిని ఎలా పడితే అలా ఉపయోగించడానికి కుదరదు. సమస్య తీవ్రతను బట్టి ఉపయోగించే విధానం కూడా భిన్నంగా ఉంటుంది. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

పొడి చర్మం నుంచి..

కొందరికి శీతాకాలంతో పాటు తరచూ చర్మం పొడిబారుతుంటుంది. అలాంటివారు శెనగ పిండిని కాస్త మీగడలో కలిపి ముఖానికి రాసుకుంటే మంచి ప్రయోజనముంటుంది. క్రీమ్, శెనగపిండితో చేసిన ఫేస్ ప్యాక్ చర్మానికి అవసరమైన తేమను అందించి మృదువుగా మారుస్తుంది. అదేవిధంగా ముఖానికి నిగారింపును కూడా తీసుకొస్తుంది. ఇందుకోసం శెనగ పిండి, మీగడ కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. కొంత సమయం తర్వాత పరిశుభ్రమైన నీళ్లతో ముఖం కడుక్కోవాలి.

చెమట పట్టకుండా..

కొందరికి ముఖం ఎప్పుడూ ఆయిలీగా, తరచుగా చెమట పడుతుంటుంది.ఈ సమస్యను దూరం చేసుకోవడానికి శెనగ పిండిని పెరుగుతో కలిపి చర్మంపై రాయాలి. ఇది చర్మంలో అదనపు సెబమ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. అయితే ఈ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసే ముందు పరిశుభ్రమైన నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. అదేవిధంగా శుభ్రమైన గుడ్డతో తుడే,ఏరెవాలి. ఆ తర్వాత ఈ ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో మళ్లీ ముఖాన్ని కడుక్కోవాలి.

మొటిమలను తొలగించడానికి..

మొటిమల వల్ల ముఖం అంద విహీనంగా కనిపిస్తుంది. అయితే మొటిమలను నిరోధించడంలో శెనగ పిండి బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం కొంచెం శనగపిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో దోసకాయ ముక్కలు వేసి బాగా మిక్స్‌ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మెడ నుండి ముఖం వరకు బాగా అప్లై చేసుకోవాలి. దాదాపు 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మీ మొటిమల సమస్య తొలగిపోయి ముఖం మెరుపు సంతరించుకుంటుంది.

డల్‌నెస్‌ను పొగోట్టుకునేందుకు

చర్మంలో మృతకణాలు, విషతుల్యాలు పేరుకుపోవడం వల్ల ముఖం డల్‌గా మారిపోతుంది. అలాంటివారు శెనగపిండిలో కాస్త రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకుంటే మంచి ఫలితముంటుంది. అలాగే కొంచెం పసుపు, ముల్తానీ మట్టిని మిక్స్ చేసి మెడ నుండి ముఖానికి అప్లై చేయండి. చేతులతో మృదువుగా మసాజ్ చేయండి. దాదాపు 15 నిమిషాల తర్వాత పరిశుభ్రమైన నీటితో ముఖాన్ని కడుక్కుంటే ముఖం మిలమిలా మెరుస్తుంది.

Also Read:Andhra Pradesh: ఘరానా ముఠా బీభత్సం.. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే భారీ చోరీ.. ఇంతకీ ఏం ఎత్తుకుపోయారంటే..

విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారి నుంచి వేల కోట్లు కట్టించాం.. సుప్రీం కోర్టుకు కేంద్రం వివరణ

Statue of Equality: సమతాస్ఫూర్తి కేంద్ర సందర్శకులకు అనుమతి.. టైమింగ్స్ ఇవే..