30 రోజులు ఈ ఆసనాన్ని వేశారంటే.. మీ శారీరక, మానసిక ఆరోగ్యంలో ఈ 10 మార్పులు చూడొచ్చు!

ప్రస్తుతం మారిన జీవన శైలితో అనేక శారీరక మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకనే రోజూ వ్యాయామం, యోగా వంటి వాటిని చేయడం వలన అనేక ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సూర్య నమస్కారం అనేది ఒక ప్రభావవంతమైన యోగాసనం. దీనిని చేయడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా , ఆధ్యాత్మికంగా మెరుగ్గా చేస్తుంది..

30 రోజులు ఈ ఆసనాన్ని వేశారంటే.. మీ శారీరక, మానసిక ఆరోగ్యంలో ఈ 10 మార్పులు చూడొచ్చు!
Surya Namaskar Benefits

Updated on: Jan 24, 2026 | 3:49 PM

వేగంగా మారుతున్న జీవనశైలి, బిజీ బిజీ జీవితంలో చాలా మంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు మీ రోజును మెరుగుపరుచుకోవాలనుకుంటే.. రోజుని యోగాతో ప్రారంభించవచ్చు. యోగాలో అనేక రకాల ఆసనాలు ఉన్నప్పటికీ.. అత్యంత ప్రభావంతమైన యోగాసనం చేయాలనుకుంటే.. సూర్య నమస్కారం చేయవచ్చు. నిజానికి సూర్య నమస్కారం కేవలం యోగాభ్యాసం కాదు. ఇది ఆరోగ్యకరమైన జీవితం వైపు వెళ్ళడానికి ఒక ప్రభావవంతమైన మార్గం. ఎవరైనా సరే 30 రోజులు నిరంతరం సూర్య నమస్కారం చేస్తే.. శరీరం, మనస్సు, ఆత్మను కొత్త శక్తితో నింపుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ సూర్య నమస్కారం చేయడం వల్ల బరువు తగ్గడమే కాదు రోగనిరోధక శక్తి కూడా సులభంగా పెరుగుతుంది.

సూర్య నమస్కారం అంటే ఏమిటి?

సూర్య నమస్కారం అనేది ఒక విధమైన వ్యాయామం. దీని ద్వారా శరీర కండరాలు ఉత్తేజితమవుతాయి. సూర్య నమస్కారంలో మొత్తం 12 ఆసనాలు ఉన్నాయి. వీటిని చేయడం ద్వారా శరీరం బలంగా మారుతుంది. ఇలా చేయడం వల్ల మానసిక ఏకాగ్రత కూడా పెరుగుతుంది. సూర్య నమస్కారం చేయడం ద్వారా శరీరం సాగదీయడం, సమతుల్యత, శ్వాస సమతుల్యత ఒకేసారి జరుగుతాయి. సూర్య నమస్కారం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

సూర్య నమస్కారం చేయడం వల్ల కలిగే 10 ప్రయోజనాలు..

బరువు వేగంగా తగ్గుతారు

సూర్య నమస్కారం బరువును వేగంగా తగ్గించుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఇది కార్డియో వ్యాయామం లాగా పనిచేస్తుంది. ఒక రౌండ్ సూర్య నమస్కారం చేయడం వల్ల దాదాపు 14 కేలరీలు ఖర్చవుతాయి. కనుక ఎవరైనా రోజూ 12-24 రౌండ్లు సూర్య నమస్కారం చేస్తే శరీర జీవక్రియ పెరుగుతుంది. కొవ్వు వేగంగా కరుగుతుంది.

ఇవి కూడా చదవండి

శరీరం ధృడంగా

సూర్య నమస్కారం చేయడం వల్ల శరీరం సరళంగా మారుతుంది. ఇలా చేయడం వల్ల వెన్నెముక, భుజాలు, వీపు, నడుము, కాళ్ళలో సరళత వస్తుంది. 30 రోజుల పాటు నిరంతరం సాధన చేయడం వల్ల శరీరం ధృడంగా మారుతుంది.

కీళ్ళు బలపడతాయి

సూర్య నమస్కారం చేయడం వల్ల శరీర కండరాలు మెరుగుపడతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఒక నెల పాటు క్రమం తప్పకుండా సూర్య నమస్కారం చేయడం వలన ఆర్థరైటిస్ వంటి కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది.

జీర్ణక్రియ మెరుగ్గా

సూర్య నమస్కారం ఉదర కండరాలను మసాజ్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. సూర్య నమస్కారం గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సూర్య నమస్కారాన్ని 30 రోజులు చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

మానసిక ఒత్తిడి తగ్గుదల

ప్రస్తుతం చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అటువంటి పరిస్థితిలో సూర్య నమస్కారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు ఒత్తిడి, ఆందోళన , నిరాశను తగ్గిస్తుంది. ఈ ఆసనం వేసే సమయంలో శ్వాస తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. ఈ యోగాసనాన్ని వరుసగా 30 రోజులు చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

చర్మం ప్రకాశవంతం

ప్రతిరోజూ క్రమం తప్పకుండా సూర్య నమస్కారం చేస్తే చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది ముఖంపై మెరుపును తెస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. మొటిమలు, ముడతల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఏకాగ్రత పెంపు

సూర్య నమస్కారం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. విద్యార్థి, ఉద్యోగులు ఎవరైనాసరే సూర్య నమస్కారం చేయడం వలన మానసిక స్పష్టత, ఏకాగ్రత పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తద్వారా ఏకాగ్రతతో బాగా చదువుకోవచ్చు. పనులు చేసుకోవచ్చు.

మహిళలకు మేలు

సూర్య నమస్కారం మహిళలకు చాలా మంచిది. ఇది హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. రుతుక్రమంలో లోపాలు లేదా పీరియడ్స్‌ నొప్పులు ఉంటే ప్రతిరోజూ సూర్య నమస్కారం చేయడం వలన ప్రయోజనం ఉంటుంది.

శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు

సూర్య నమస్కారాన్ని వరుసగా 30 రోజులు చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది . ఇలా చేయడం వల్ల శరీరంలోని ఎండోక్రైన్ గ్రంథులు చురుగ్గా పనిచేస్తాయి.

సూర్య నమస్కారం చేయడానికి సరైన సమయం ఏది?

సూర్య నమస్కారం చేయడానికి ఉత్తమ సమయం సూర్యోదయ సమయం. అలాగే సాయంత్రం వేళ ప్రశాంతమైన, సౌకర్యవంతమైన సమయంలో కూడా చేయవచ్చు. శక్తి, వశ్యత , సంకోచాన్ని పెంచడానికి ఉదయం 6:00 నుంచి 8:00 గంటల మధ్య యోగా చేయాలి. లేదా సాయంత్రం 4:00 గంటల నుంచి 6:00 గంటల వరకు యోగా చేయవచ్చు. సూర్య నమస్కారం ఒత్తిడిని తగ్గించడంలో, రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.