Benefits of Coconut Oil on Skin: కొబ్బరి నూనెతో చర్మ సమస్యలకు చెక్.. ఈ ప్రయోజనాలు మీకు తెలుసా..

|

Jun 29, 2022 | 9:49 PM

కొబ్బరి నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జుట్టు బలానికి మాత్రమే కాదు.. కొబ్బరి నూనెను ముఖంపై అప్లై చేయడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. రాత్రి పడుకునే ముందు

Benefits of Coconut Oil on Skin: కొబ్బరి నూనెతో చర్మ సమస్యలకు చెక్.. ఈ ప్రయోజనాలు మీకు తెలుసా..
Coconut Oil
Follow us on

Benefits of Coconut Oil on Skin:  కొబ్బరి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా మందికి తెలుసు.. కానీ కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఎంతమందికి తెలుసో తెలియదు కానీ, కొబ్బరి నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జుట్టు బలానికి మాత్రమే కాదు.. కొబ్బరి నూనెను ముఖంపై అప్లై చేయడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. రాత్రి పడుకునే ముందు ముఖానికి కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల వివిధ రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

కొబ్బరి నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లినోలిక్ యాసిడ్, విటమిన్ ఎఫ్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మీ చర్మానికి సహజ మాయిశ్చరైజర్ గా పనిచేసి చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా చేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనె చర్మంలో కొల్లాజెన్ ను పెంచడం ద్వారా ముడతలను తగ్గిస్తుంది.  అయితే, చర్మం జిడ్డుగా ఉంటే కొబ్బరి నూనెను ఉపయోగించవద్దంటున్నారు.

కొబ్బరి నూనె వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయంటున్నారు..సున్నితమైన చర్మంపై కొబ్బరి నూనెను ఉపయోగించడం హానికరం. కొబ్బరికి అలర్జీ ఉన్నవారికి కొబ్బరి నూనెకు అలర్జీ సమస్య కూడా ఉండవచ్చు. లారిక్ యాసిడ్ ఉండటం వలన, బ్రెస్ట్ కు అప్లై చేసినప్పుడు తల్లి పాలు తాగే శిశువులలో ఇది అలర్జీ ప్రతి చర్యలకు కారణమవుతుంది. కొబ్బరి నూనె అధిక మొత్తంలో ఉండటం వల్ల చర్మం జిగటగా,జిడ్డుగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి