Health: మలబద్ధకం, అతిసారం, యూరిన్‌ ఇన్ఫెక్షన్‌.. అన్ని సమస్యలకు ఈ పండు పరిష్కారం

|

Oct 01, 2024 | 3:56 PM

మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ పూర్తిగా తగ్గడం కారణం ఏదైనా ఇటీవల చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మలబద్దకం సమస్య చిన్న వయసు వారిని కూడా వేధిస్తోంది. అదే విధంగా కొందరిలో అతిసారం కూడా చాలా సర్వసాధారణమైన విషయం. మరి ఇలాంటి ఎన్నో సమస్యలకు...

Health: మలబద్ధకం, అతిసారం, యూరిన్‌ ఇన్ఫెక్షన్‌.. అన్ని సమస్యలకు ఈ పండు పరిష్కారం
Health
Follow us on

మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ పూర్తిగా తగ్గడం కారణం ఏదైనా ఇటీవల చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మలబద్దకం సమస్య చిన్న వయసు వారిని కూడా వేధిస్తోంది. అదే విధంగా కొందరిలో అతిసారం కూడా చాలా సర్వసాధారణమైన విషయం. మరి ఇలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం ఒక చిన్న పండు. అదే అరటి పండు. తక్కువ ధరకు, సీజన్‌తో సంబంధం లేకుండా లభించే అరటి పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా.? ఇంతకీ అరటి పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి అరటి పండు దివ్యౌషధంగా చెప్పొచ్చు. ప్రతీ రోజూ ఒక అరటి పండు తీసుకుంటే మలబద్ధకం సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్, విటమిన్లు A, B6, C, Dఉల మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని కల్పిస్తుంది. అంతేకాకుండా అరటిలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మలబద్దకం సమస్య వేధించడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నిద్రలేమి, రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, ఒత్తిడి, డిప్రెషన్‌ వంటి సమస్యల కారణంగా మలబద్ధకం వేధిస్తుంది.

కేవలం మలబద్ధకం మాత్రమే కాకుండా అతిసారంతో బాధపడేవారికి కూడా అరటి పండు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. విరేచనలతో బాధపడేవారు పూర్తి కారాన్ని తగ్గించాలని అంటున్నారు. వీరి అరటి పండును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అతిసారం సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక యూటీఐ ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారికి కూడా అరటి పండు బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

మూత్ర విసర్జన చేసే సమయంలో మంటగా ఉండడం, నొప్పిగా ఉండడం వలి సమస్యలకు అరటి పండు మంచి పరిష్కారంగా చెప్పొచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లో అరటిపండు మేలు చేస్తుంది. అరటి కాండం రసంను తీసుకోవడం వల్ల శరీరం నుంచి విషపదార్థాలు తొలగిపోతాయి. నిద్రలేమి, ఒత్తిడితో పాటు జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలకు కూడా అరటి పండు బాగా ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా అరటి పండును తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..