Baba Ramdev: చలికాలంలో రక్తహీనతకు చెక్.. బాబా రాందేవ్ చెప్పిన ABC జ్యూస్ మ్యాజిక్ తెలుసా..?

చలికాలంలో గడ్డకట్టే చలి నుంచి తప్పించుకోవడానికి మీరు స్వెటర్లు, దుప్పట్లపై ఆధారపడుతున్నారా? అయితే ఆగండి! మీ శరీరం లోపల రక్తం తక్కువగా ఉన్నా కూడా మీకు ఇతరులకన్నా ఎక్కువ చలి వేస్తుంది. యోగా గురువు బాబా రాందేవ్ చలికాలపు అనారోగ్యాలకు స్వదేశీ పరిష్కారాలను చూపారు. రక్తహీనత నుంచి జీర్ణక్రియ సమస్యల వరకు.. మన వంటింట్లో దొరికే పదార్థాలతో ఎలా చెక్ పెట్టవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Baba Ramdev: చలికాలంలో రక్తహీనతకు చెక్.. బాబా రాందేవ్ చెప్పిన ABC జ్యూస్ మ్యాజిక్ తెలుసా..?
Baba Ramdev Health Tips For Winter

Updated on: Jan 14, 2026 | 12:32 PM

చలికాలం రాగానే చాలామంది చలికి వణికిపోతుంటారు. ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా చేతులు, కాళ్లు చల్లగా మారుతుంటాయి. అయితే ఇది కేవలం బయటి వాతావరణం వల్ల మాత్రమే కాదు, మీ శరీరంలో రక్తం తక్కువగా ఉండటం వల్ల కూడా జరగవచ్చునని యోగా గురువు బాబా రాందేవ్ హెచ్చరిస్తున్నారు. సరైన ఆహారం, యోగాసనాలతో చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకుంటూనే.. అద్భుతమైన ఆరోగ్యాన్ని ఎలా పొందాలో ఆయన వివరించారు.

రక్తహీనతే చలికి ప్రధాన కారణం

శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు, రక్త ప్రసరణ సరిగ్గా జరగక చేతులు, కాళ్లు త్వరగా చల్లబడతాయి. దీనివల్ల బలహీనత, శక్తి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. దీనిని అధిగమించడానికి బాబా రాందేవ్ క్యారెట్, టమోటా, బీట్‌రూట్, ఆమ్లా కలిపిన జ్యూస్‌ను సిఫార్సు చేస్తున్నారు.

బీట్‌రూట్: ఇది రక్త నాళాలను శుద్ధి చేసి, రక్త శాతాన్ని పెంచుతుంది.

క్యారెట్: కంటి చూపుకు అవసరమైన విటమిన్ ఏ ని అందిస్తుంది.

ఆమ్లా: విటమిన్ సి నిధి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, ఫ్లూ దరిచేరనివ్వదు.

జీర్ణక్రియే ఆరోగ్యానికి ఆధారం

జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే గ్యాస్, అసిడిటీ మాత్రమే కాకుండా మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఉందని రాందేవ్ హెచ్చరించారు. అల్లం రసం తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడి జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. అలాగే చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పులను తగ్గించడానికి అల్లం అద్భుతంగా పనిచేస్తుంది.

ఆకుకూరల సాగ్ మ్యాజిక్

శరీరాన్ని సహజంగా వెచ్చగా ఉంచడానికి బచ్చలికూర, బతువా, మెంతి కూరలను కలిపి వండుకోవాలని ఆయన సూచించారు. ఈ ఆకుకూరలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో కొంచెం నిమ్మకాయ, అల్లం, పసుపు చేర్చడం వల్ల పోషకాలు శరీరానికి త్వరగా అందుతాయి. ఇవి చవకైనవే కాకుండా ఆరోగ్యాన్ని పదిలం చేస్తాయి.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

కేవలం ఆహారం మాత్రమే కాదు శరీర అవయవాలు చురుగ్గా పనిచేయడానికి యోగా అవసరమని బాబా రాందేవ్ తెలిపారు. మండూకాసనం – భుజంగాసనం వంటి ఆసనాలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేసి కాలేయం సరిగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. హనుమాన్ దండ మొత్తం శరీరానికి శక్తిని ఇస్తుంది. కాలేయం – మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటేనే రక్త కణాల ఉత్పత్తి మెరుగ్గా ఉంటుందని ఆయన వివరించారు.