Raw Turmeric Tea : పచ్చి పసుపుతో ఆయుర్వేద టీ..! ఇలా వాడితే క్యాన్సర్ కణాలు ఖతమేనట..!!

|

Mar 12, 2024 | 8:55 AM

కర్కుమిన్ దానికి కావలసిన శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఈ టీ మేలు చేస్తుంది. కర్కుమిన్‌లోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. అవి కణాల నాశనాన్ని నిరోధిస్తాయి. మొత్తం శ్రేయస్సుకు మద్దతు ఇస్తాయి. కొన్ని అధ్యయనాలు కర్కుమిన్ క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుందని సూచిస్తున్నాయి.

Raw Turmeric Tea : పచ్చి పసుపుతో ఆయుర్వేద టీ..! ఇలా వాడితే క్యాన్సర్ కణాలు ఖతమేనట..!!
Raw Turmeric Tea
Follow us on

చాలా మందికి ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇలా వేడి వేడిగా తాగే టీ, కాఫీలు శరీరాన్ని రిఫ్రెష్ చేస్తాయి. అవి కొత్త శక్తిని అందిస్తాయి. దాంతో చురుకుగా ఉంటారు. అయితే, ఇటీవల కాఫీ, టీ లకు బదులు కొన్ని రకాల ఆయుర్వేద టీలు ప్రాచుర్యం పొందాయి. అలాంటి టీ ఒకటి పచ్చి పసుపు టీ. పసుపులోని సహజ సమ్మేళనాలు శరీరానికి మేలు చేస్తాయి. అయితే గ్రీన్ టర్మరిక్ టీ తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన ఈ పానీయం ఎలా తయారు చేయాలి..? ఈ టీ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి.

పచ్చి పసుపు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పసుపు పొడి కంటే ఎక్కువ కర్కుమిన్ ఉంటుంది. ఇది శోథ నిరోధక, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో వ్యాధులతో పోరాడుతుంది. పచ్చి పసుపు శరీర కణాలలో అంతర్గత వాపును తగ్గిస్తుంది. ఇది కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

* ఎలా తయారు చేసుకోవాలి..?

ఇవి కూడా చదవండి

పచ్చి పసుపు టీ తయారు చేయడానికి నీరు, పచ్చి పసుపు కొమ్ములు, కావాలనుకుంటే బెల్లం తీసుకోండి. ముందుగా నీటిని బాగా మరిగించాలి. అందులో కొద్దిగా తురిమిన పచ్చి పసుపు వేయండి. ఈ నీళ్లు బాగా మరిగే వరకు వేడి చేయాలి. ఆ తరువాత మీరు కావాలనుకుంటే తీపి కోసం బెల్లం లేదా మిస్రీని వేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వడగట్టి తాగేయాలి.

* వ్యాధులకు చెక్ పెట్టండి

మీరు ఉదయాన్నే గ్రీన్ టర్మరిక్ టీ తాగితే, శరీరం సహజంగా వివిధ ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే మంటతో పోరాడుతుంది. కర్కుమిన్ దానికి కావలసిన శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఈ టీ మేలు చేస్తుంది. కర్కుమిన్‌లోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. అవి కణాల నాశనాన్ని నిరోధిస్తాయి. మొత్తం శ్రేయస్సుకు మద్దతు ఇస్తాయి. కొన్ని అధ్యయనాలు కర్కుమిన్ క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుందని సూచిస్తున్నాయి.

* జాగ్రత్తలు తప్పనిసరి

కానీ పచ్చి పసుపు రుచి కొందరికి నచ్చకపోవచ్చు. అలాగే, ఈ పానీయం అందరికీ పడదు. ఇప్పటికే ఏవైనా జబ్బులతో బాధపడుతూ రకరకాల మందులు వాడుతున్న వారు గ్రీన్ టర్మరిక్ టీ తాగితే వైద్యుడిని సంప్రదించాలి. ఈ టీని మితంగా తాగడం మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి