రోజులో 8 గంటలు కూర్చునే పనిచేస్తున్నారా? అయితే, ఈ రెండు ఆహారాలకు దూరంగా ఉండండి..

|

Jun 12, 2023 | 10:24 AM

8 గంటలు నిర్వరామంగా కంప్యూటర్‌ ముందు కూర్చోవడం వల్ల ఐదేండ్లలో శరీరంలో చాలా మార్పులు వస్తాయి. సాధారణంగా కూర్చొని పని చేసే వ్యక్తుల శరీర బరువు చాలా త్వరగా పెరుగుతుంది. ఎందుకంటే రోజుకు 8 నుంచి 10 గంటల పాటు ఒకే భంగిమలో కూర్చుని పని చేయడం వల్ల నడుము, పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది. దీంతో..

రోజులో 8 గంటలు కూర్చునే పనిచేస్తున్నారా? అయితే, ఈ రెండు ఆహారాలకు దూరంగా ఉండండి..
Itting Job
Follow us on

ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు ఎదుర్కొంటున్న సాధారణ సమస్య బరువు పెరగడం. పొట్ట, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడం కారణంగా శరీరం రూపురేఖలు మారిపోతాయి. ఊబకాయం ఒక వ్యాధి కాదు. కానీ, ఖచ్చితంగా అనేక వ్యాధులకు మూలంగా మారుతుంది. మొదటిది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. అప్పుడు అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, వెరికోస్‌ వీన్స్‌ వ్యాధి, కరోనరీ ఆర్టరీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వీలైనంత తొందరగా ఊబకాయాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. 8 గంటలు నిర్వరామంగా కంప్యూటర్‌ ముందు కూర్చోవడం వల్ల ఐదేండ్లలో శరీరంలో చాలా మార్పులు వస్తాయి. సాధారణంగా కూర్చొని పని చేసే వ్యక్తుల శరీర బరువు చాలా త్వరగా పెరుగుతుంది. ఎందుకంటే రోజుకు 8 నుంచి 10 గంటల పాటు ఒకే భంగిమలో కూర్చుని పని చేయడం వల్ల నడుము, పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది.

సాధారణంగా వెన్నెముక ఎస్‌ ఆకారంలో ఉంటుంది. రోజులో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్నెముక కాస్త సి షేప్‌కు మారుతుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పొట్ట, ఛాతి దగ్గర ఉండే కండరాలు బలహీనంగా మారుతాయి. దాంతో రక్తప్రసరణ సరిగ్గా జరుగదు. అంతేకాదు దీంతోపాటు కంటిచూపు తగ్గుతుంది. తలనొప్పి కూడా ఎక్కువగా వస్తుంది. ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల రక్తప్రసరణ జరుగదు. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ పేరుకుపోతుంది. దీంతో హార్ట్‌ఎటాక్‌లు వస్తాయి. చాలామంది కూర్చున్నప్పుడు కాళ్లమీదికాళ్లు వేసుకొని కూర్చుంటారు. అలా కూర్చోవడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టుకు పోతుంది. దీంతో ఆయా ప్రదేశాల్లో రక్తనాళాల్లో రక్త సరఫరా సరిగ్గా జరుగక అక్కడ నాళాలు వాపులకు లోనవుతాయి. ఇది మరింత తీవ్రమైతే వెరికోస్‌ వీన్స్‌ అంటారు. సాధారణ ఈ సమస్య కూడా ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారికే వస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం, ఏసీల్లో పనిచేయడం, ఆకలి వేయకున్నా ఏదో ఒకటి లాగించేయడం, నిద్రలేమి.. వంటి కారణాలు తోడైతే స్థూలకాయం సమస్య మరింత పెరుగుతుంది. నిత్యం కూర్చుని ఉద్యోగం చేసేవారిలో కండరాలు, ఎముకలు త్వరగా బలహీనంగా మారిపోతాయి.  అటువంటి పరిస్థితిలో, మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఈ రెండు వస్తువులను దూరంగా ఉంచడం వల్ల బరువు పెరగడాన్ని నియంత్రించవచ్చు.

1. ఆయిల్ ఫుడ్ :

ఆయిల్ ఫుడ్ తినే ట్రెండ్ మన దేశంలో చాలా ఎక్కువ . దీని కారణంగా మన శరీరంలో చాలా కొవ్వు పేరుకుపోతుంది. ఇందులో కేలరీలు చాలా ఎక్కువ. కూర్చొని వర్కవుట్ చేసే వారికి కేలరీలు బర్న్ కావు. బదులుగా అది కొవ్వుగా మారడం ప్రారంభిస్తుంది. కాబట్టి, మీ శారీరక కార్యకలాపాలు తగ్గుతున్నట్లయితే, కనీసం ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా బరువును నియంత్రించడానికి ప్రయత్నించండి.

ఇవి కూడా చదవండి

2. స్నాక్స్ :

సాధారణంగా కూర్చొని పని చేస్తూ టీతో పాటు బిస్కెట్లు, స్నాక్స్ తినడానికి ఇష్టపడతారు. ఆకలిగా ఉన్నప్పుడు లేదంటే ఏదైనా తినాలని అనిపించినప్పుడు, చిప్స్, కరు కురే స్నాక్స్, బిస్కెట్లు వంటి వివిధ రకాల స్నాక్స్ కూడా తింటారు. ఇవి నోటికి రుచిని అందిస్తాయనడంలో సందేహం లేదు. కానీ అవి మీ శరీరంలో క్యాలరీలను పెంచుతాయి. దీని కారణంగా బరువు వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ..