
నాన్ వెజ్ ప్రియులు మటన్‌ను ఇష్టంగా తింటారు.. మేక మాంసంలోని ప్రతీ భాగం ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది.. మటన్, గుండె, థిల్లి, కాళ్లు, తలకాయ.. దబ్బా (Goat Lungs).. ఇలా అన్ని కూడా ప్రత్యేకమైనవే.. దేనికదే స్పెషల్.. వీటిలో ప్రోటీన్ తోపాటు.. ఎన్నో పోషకాలు దాగున్నాయి. అయితే.. మటన్ దబ్బాను మటన్ ప్రియులు ఇష్టంగా వండుకుని తింటారు.. మటన్ దబ్బా అనేది ప్రధానంగా మేక ఊపిరితిత్తులు (lungs) లేదా ఇతర అవయవాలతో చేసే ఒక రుచికరమైన, మసాలాతో కూడిన వంటకం.. దీనిని కొన్ని ప్రాంతాలలో పోటెల్ దబ్బా కూర.. లేదా దబ్బా గోష్ట్ అని కూడా అంటారు. తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో మటన్ దబ్బ కూరను చాలా ఇష్టంగా తింటారు.
మటన్ దబ్బా ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ B12, ఖనిజాలతో నిండి ఉంటుంది. ఎముకల సాంద్రతను పెంచడంతోపాటు.. కీళ్ల నొప్పిని తగ్గిస్తుంది.. ఇంకా కండరాలను బలపరుస్తుంది.. రోగనిరోధక శక్తిని పెంచి.. రక్తహీనతను నివారిస్తుంది.. మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది.
మటన్ దబ్బ కూరను సాధారణంగా గ్రేవి.. ఫ్రై లా చేసుకుని తినవచ్చు..
మటన్ దబ్బ వాసన లేకుండా రుచికరంగా వండడానికి కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటించాలి.
ముందుగా.. మేక ఊపిరితిత్తులను బాగా శుభ్రం చేయాలి.. అనంతరం అల్లం – వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, మసాలాలు కలిపి మ్యారినేట్ చేసి పక్కకు ఉంచుకోవాలి..
ఉల్లిపాయలు, టొమాటోలు (ఇష్టమైతేనే) నూనెలో వేయించి.. అనంతరం ఊపిరితిత్తులను వేసి ఉడికించాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా గరం మసాలా వేయాలి..
అంతేకాకుండా.. వాసన రాకుండా ఉండేందుకు ముందుగా దబ్బ ముక్కలను శుభ్రంగా కడిగి, పసుపు వేసి కుక్కర్‌లో ఒకటి లేదా రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. ఈ ప్రక్రియ వల్ల దబ్బలోని నీరు పోయి, బ్యాక్టీరియా తొలగిపోయి, వాసన తగ్గుతుంది. ఆ తర్వాత వండుకుంటే బెటర్ అంటున్నారు డైటీషియన్లు..
అయితే.. ఏమైనా సమస్యలుంటే.. మటన్ దబ్బను తినే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..