Asafoetida Side Effects in Telugu: ఆహారాల్లో రుచి కోసం ఉపయోగించే ఇంగువ అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్వత ప్రాంతాల్లో కనిపించే ఫెరుల్ ఫోటిడా అనే మొక్క సాధారణంగా 6 నుంచి 8 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఈ మొక్క నుంచి ఇంగువ తయారు చేస్తారు. ఇంగువలో విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇంగువను ఆహారంలో తీసుకోవడం ద్వారా అనేక వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. ఐతే అధికంగా ఇంగువను తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే..
అధిక రక్తపోటు
ఇంగువను అధికంగా తీసుకుంటే రక్తపోటు హెచ్చుతగ్గులకు లోనవుతుంది. బ్లడ్ ప్లజర్ సమస్యలున్నవారు ఇంగువ తినడం మానేయడం మంచిది.
సంతానోత్పత్తి సమస్యలు
గర్భధారణ సమయంలో కూడా ఇంగువను ఆహారంలో తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంగువకు గర్భస్రావం కలిగించే గుణం ఉంటుంది. అందువల్ల ప్రెగ్నెంట్ మహిళలు ఇంగువకు దూరంగా ఉండాలి.
తలనొప్పి
ఇంగువను అధికంగా తింటే తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు తలెత్తుతాయని అధ్యయనాలు వెల్లడించాయి.
కండరాల వాపు
ఇంగువను ఆహారంలో తీసుకునే వారిలో చాలా మందికి పెదవులు, మెడ, ముఖం వాపు వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అటువంటి వారు దీని వినియోగాన్ని తగ్గించడం బెటర్.
దద్దుర్లు
ఇంగువ తినేవారిలో కనిపించే మరో ముఖ్య సమస్య ఏంటంటే.. చర్మంపై దద్దుర్లు. చర్మానికి సంబంధించిన ఏదైనా సమస్య కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.