విటమిన్ ఎ, రెటినోల్ అని కూడా పిలుస్తారు. ఇది కొవ్వులో కరిగే పోషకం. ఇది రోగనిరోధక శక్తి, సంతానోత్పత్తి, ఆరోగ్యకరమైన దృష్టికి అవసరం. అదే పోషకం చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలికంగా ఇది వృద్ధాప్యం లక్షణాలను ఆలస్యం చేయడానికి కారణమవుతుంది. శరీరానికి తగినంత పోషకాలు లభించనప్పుడు, దానిని విటమిన్ ఎ లోపం అంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పరిస్థితి అంధత్వం నుండి వంధ్యత్వం వరకు బలహీనపరిచే దుష్ప్రభావాలకు దారితీస్తుంది. కానీ విటమిన్ ఎ లోపం లక్షణాల గురించి ప్రతిఒక్కరూ అవగాహాన కలిగి ఉండాలి.
లక్షణాలు ఇవే
విటమిన్ ఎ లోపం శరీరం పనిచేసే విధానాన్ని దెబ్బతీస్తుంది. ఇది అంధత్వం, దృష్టి కోల్పోయే ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతారు. ఇది ఊపిరితిత్తులు, కణజాలాలు, చర్మం, గుండె, రోగనిరోధక వ్యవస్థ సమస్యలకు కూడా దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. ఇక కాలేయ రుగ్మతలు, అవసరమైన విటమిన్లను గ్రహించే శరీర సామర్థ్యాన్ని దెబ్బతీసే పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
విటమిన్ ఎ ఎందుకు అవసరం?
విటమిన్ ఎ శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. కణాల అభివృద్ధి, దృష్టి, జీవక్రియకు కూడా ఇది చాలా ముఖ్యమైనది. ఇది రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుందని, పునరుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరం కూడా సరైన పోషకాహారాన్ని పొందడం ద్వారా దానిని స్వయంగా తయారు చేసుకోవచ్చు. దృష్టి సరిగా పనిచేయడానికి ఈ పోషకం తప్పనిసరి అని నిపుణులు అంటున్నారు.
విటమిన్ ఎ లోపం లక్షణాలు
మొటిమలు
పొడి చర్మం
పొడి కళ్ళు
వంధ్యత్వం
గర్భం పొందడంలో ఇబ్బంది
రేచీకటి
గొంతు, ఛాతీ ఇన్ఫెక్షన్లు
ఆలస్యమైన పెరుగుదల