AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలు కొనేటప్పుడు జాగ్రత్త.. ఇలా టెస్ట్ చేస్తే అసలు నిజం బయటపడుతుంది

Milk Adulteration test at home: స్వచ్ఛమైన పాల పేరుతో మార్కెట్‌లో కల్తీ పాలు అమ్ముతున్నారు. నీరు, డిటర్జెంట్, పిండిపదార్థాలు కలిపిన పాలను ఇంట్లోనే సులభమైన పరీక్షల ద్వారా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కల్తీ పాలు ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో, ఎలా కల్తీపాలను గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం..

పాలు కొనేటప్పుడు జాగ్రత్త.. ఇలా టెస్ట్ చేస్తే అసలు నిజం బయటపడుతుంది
Milk Adulteration Test
Srilakshmi C
|

Updated on: May 29, 2026 | 1:02 PM

Share

ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న పాలలో కల్తీ సమస్య రోజురోజుకీ పెరుగుతోంది. స్వచ్ఛమైన పాల పేరుతో నీరు, డిటర్జెంట్, పిండిపదార్థాలు వంటి హానికర పదార్థాలను కలిపి విక్రయిస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి కల్తీ పాలను తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇంట్లోనే కొన్ని సులభమైన పరీక్షల ద్వారా పాల స్వచ్ఛతను గుర్తించవచ్చని చెబుతున్నారు.

నీళ్లు కలిపారా? ఇలా తెలుసుకోండి

పాలలో ఎక్కువగా కలిపే పదార్థం నీరు. దీన్ని గుర్తించడానికి మెరిసే నునుపైన ఉపరితలంపై ఒక చుక్క పాలు వేయాలి. ఆ చుక్క నెమ్మదిగా దొర్లుతూ తెల్లటి గీతను వదిలితే పాలు స్వచ్ఛమైనవిగా భావించవచ్చు. ఒకవేళ చుక్క వేగంగా జారిపోతూ ఎలాంటి గుర్తు వదలకపోతే అందులో నీరు కలిపినట్లు అర్థం.

డిటర్జెంట్ కలిపిన పాలు ఇలా గుర్తించాలి?

కొంతమంది వ్యాపారులు పాలకు ఎక్కువ నురుగు రావడానికి, చిక్కదనం పెంచడానికి డిటర్జెంట్ కలుపుతుంటారు. దీన్ని తెలుసుకోవడానికి ఒక గాజు పాత్రలో 5 నుంచి 10 మిల్లీలీటర్ల పాలు తీసుకుని, అంతే పరిమాణంలో నీరు కలపాలి. ఆ తర్వాత బాగా షేక్ చేయాలి.

ఇవి కూడా చదవండి

స్వచ్ఛమైన పాలలో కొద్దిగా నురుగు వచ్చి త్వరగా తగ్గిపోతుంది. కానీ డిటర్జెంట్ కలిపిన పాలలో సబ్బులాంటి చిక్కటి నురుగు ఏర్పడి ఎక్కువసేపు అలాగే ఉంటుంది. అలాంటి పాలను తాగడం ఆరోగ్యానికి హానికరం.

పిండిపదార్థం కలిపారా?

పాలను చిక్కగా కనిపించేలా చేయడానికి పిండిపదార్థాలు కలుపుతుంటారు. దీన్ని గుర్తించడానికి రెండు టేబుల్ స్పూన్ల పాలలో కొద్దిగా అయోడిన్ ద్రావణం కలపాలి. పాలు నీలి రంగులోకి మారితే అందులో పిండిపదార్థం కలిపినట్లు అర్థం.

కృత్రిమ పాలను వాసనతోనే గుర్తించవచ్చు

స్వచ్ఛమైన పాలకు సహజమైన తీపి రుచి ఉంటుంది. కానీ కృత్రిమ పాలు కొద్దిగా చేదు రుచిని ఇస్తాయి. అలాగే వేళ్ల మధ్య పాలను రుద్దితే సబ్బులా జారుతున్నట్లు అనిపిస్తే అది కల్తీ పాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

వేడి చేసినప్పుడు రంగు మారుతుందా?

స్వచ్ఛమైన పాలు వేడి చేసినా లేదా ఫ్రిజ్‌లో ఉంచినా పసుపు రంగులోకి మారవు. ఒకవేళ పాలు పసుపు రంగులోకి మారితే వాటిలో కల్తీ పదార్థాలు ఉండే అవకాశం ఉంది. అలాంటి పాలను తీసుకోకుండా ఉండటం మంచిది.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

కల్తీ పాలు తాగడం వల్ల జీర్ణ సమస్యలు, అలర్జీలు, కిడ్నీ సమస్యలు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇలాంటి పాలను తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రతిరోజూ ఉపయోగించే పాలను పరీక్షించి చూసుకోవడం ద్వారా మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా..
గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా..
మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ టీవీకి ఎంత..
మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ టీవీకి ఎంత..
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!
ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!
ఉక్కు లాంటి బలం.. ఆరోగ్యం.. మన పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్..
ఉక్కు లాంటి బలం.. ఆరోగ్యం.. మన పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్..