ఉల్లిపాయల్ని ఇలా తింటే అంతే సంగతులు..

|

Nov 28, 2019 | 7:04 PM

ఉల్లిపాయలు కోసినప్పుడు కన్నీళ్లు రావడం కామనే..అయితే, ఉల్లిపాయల్ని సరైన విధంగా వాడుకోకపోయినా కన్నీళ్లు తప్పవంటున్నారు పరిశోధకులు.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. చాలామంది టైం సేవ్ చేసుకోవడానికి ఉల్లిపాయలను రాత్రిపూటే కట్ చేసి ఉదయమే వాడుతుంటారు. అలా చేయడం ఎంతవరకూ కరెక్ట్.? ఎంతసేపూ టైం సేవ్ అవుతుందని ఆలోచిస్తుంటాం గానీ, దాని వల్ల వచ్చే నష్టాల గురించి ఆలోచించం.. కోసిన ఉల్లిపాయలను నిలువ ఉంచితే అవి విషపూరితంగా మారి ఎన్నో రకాలైన వ్యాధులకి దారితీస్తాయి. మరి ఊరికే బయటపెట్టకుండా ఫ్రిడ్జ్ లో […]

ఉల్లిపాయల్ని ఇలా తింటే అంతే సంగతులు..
Follow us on

ఉల్లిపాయలు కోసినప్పుడు కన్నీళ్లు రావడం కామనే..అయితే, ఉల్లిపాయల్ని సరైన విధంగా వాడుకోకపోయినా కన్నీళ్లు తప్పవంటున్నారు పరిశోధకులు.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. చాలామంది టైం సేవ్ చేసుకోవడానికి ఉల్లిపాయలను రాత్రిపూటే కట్ చేసి ఉదయమే వాడుతుంటారు. అలా చేయడం ఎంతవరకూ కరెక్ట్.? ఎంతసేపూ టైం సేవ్ అవుతుందని ఆలోచిస్తుంటాం గానీ, దాని వల్ల వచ్చే నష్టాల గురించి ఆలోచించం..

కోసిన ఉల్లిపాయలను నిలువ ఉంచితే అవి విషపూరితంగా మారి ఎన్నో రకాలైన వ్యాధులకి దారితీస్తాయి. మరి ఊరికే బయటపెట్టకుండా ఫ్రిడ్జ్ లో ఉంచేద్దాం అనుకుంటున్నారా.? అలా చేయడం కూడా ఏమాత్రం సేఫ్ కాదంటారు నిపుణులు. ఉల్లిపాయలను కోసి ఉంచినప్పుడు అవి గాలి, పలురకాలైన బ్యాక్టీరియాను పీల్చుకుంటాయి..అంతేకాదు ఉల్లిలో సహజంగా ఉండే కొన్ని టాక్సిన్స్ ఎక్కువ మొత్తంలో విడుదలయ్యి, ఎన్నో రకాలైన వ్యాధులకు కారణమవుతాయి. వాంతులు, డయేరియా,తలనొప్పి లాంటి చిన్న రియాక్షన్స్ తో స్టార్ట్ అయి, దీర్ఘకాలిక వ్యాధులు ఎన్నో వచ్చే అవకాశం కూడా లేకపోలేదు..ల్యాబ్ లో చేసిన ఎన్నో పరీక్షలు ఈ విషయాన్ని రుజువు చేశాయి. అందుకే ఉల్లిపాయల్ని ఎప్పుడు కోసినా వెంటనే వాడేయటం.. కోసిన తరువాత ఏవైనా మిగిలితే పారేయటమే మంచిదని వారు హెచ్చరిస్తున్నారు.