మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం కారణంగా ఈ రోజుల్లో జుట్టు సమస్య సర్వసాధారణం. చిన్న వయసులోనే జుట్టు నెరసిపోవడం ఈ రోజుల్లో మరింత సాధారణ సమస్యగా మారిపోయింది. ప్రస్తుతం 20 నుంచి 25 ఏళ్ల యువతులు కూడా తెల్లజుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంలో తెల్ల జుట్టును దాచడానికి హెయిర్ డై లేదా రసాయన రంగును ఉపయోగిస్తున్నారు. ఇది తాత్కాలికంగా జుట్టును నల్లగా మార్చవచ్చు, కానీ ఫలితంగా ష్ప్రభావాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ గా జుట్టును నల్లగా మార్చుకోవడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం..
1. ఉల్లిపాయ రసం, ఆలివ్ నూనె:
ఉల్లిపాయ రసం తెల్ల జుట్టును తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఉల్లిపాయ రసం,నిమ్మరసంలో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు పెరగడంతో పాటు నెరిసిన జుట్టు తగ్గుతుంది.
2. బ్లాక్ టీ :
జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి బ్లాక్ టీని ఉపయోగించవచ్చు. బ్లాక్ టీలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. దీని కోసం, ఒక పాత్రలో నీరు తీసుకుని, అందులో 2 చెంచాల బ్లాక్ టీ, ఒక చెంచా ఉప్పు వేసి మరిగించాలి. తర్వాత దానిని ఫిల్టర్ చేసి చల్లార్చి జుట్టుకు పట్టించాలి.
3. కొబ్బరి నూనె మరియు నిమ్మరసం :
కొబ్బరి నూనె జుట్టును సహజంగా బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో నిమ్మరసం మిక్స్ చేసి జుట్టుకు మసాజ్ చేయాలి. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల నెరిసిన జుట్టు పెరగడం తగ్గుతుంది.
4. అల్లం- తేనె:
మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు నలుపుకు సహాయపడుతుంది. తురిమిన అల్లంను తేనెతో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించాలి. దాదాపు అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ ప్రక్రియను వారానికి కనీసం రెండుసార్లు ప్రయత్నించాలి ఫలితం మీరే చూస్తారు..
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..