5 / 5
ప్రశాంతతనిస్తుంది
తులసి చర్మంపై చికాకును మాయం చేసి ప్రశాంతతనిస్తుంది. చికాకు నుంచి ఉపశమనం ఇస్తుంది. తులసిలో ఉండే యూజెనాల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, అనాల్జేసిక్ లక్షణాలతో కూడిన సమ్మేళనం. ఇది చర్మంపై వాపు, మంటను తగ్గిస్తుంది. తులసిలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని పర్యావరణ ఒత్తిళ్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి.