దుంప జాతికి చెందిన కూరగాయల్లో ముల్లంగి కూడా ఒకటి. మార్కెట్లలో కూడా ముల్లంగి ఇప్పుడు విరివిగానే లభ్యమవుతుంది. అయితే చాలా మందికి ముల్లంగి అంటే చాలా చిరాకు. తినడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే ముల్లంగి నుంచి అదొక రకమైన వాసన వస్తుంది. దీంతో ముల్లంగిని పక్కన పెట్టేస్తారు. కానీ ముల్లంగిలో ఆరోగ్యానికి అవసరం అయ్యే అనేక రకాల పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, బి6, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, ఐరన్, జింక్, క్యాల్షియం వంటివి సమృద్ధిగా లభ్యమవుతాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటారు. ముల్లంగితో ఒక్కటేంటి.. చాలా రకాల ఉపయోగాలే ఉన్నాయి. మరి ముల్లంగి తీసుకుంటే శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటీస్‌తో బాధ పడేవారు ముల్లంగి తినడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ముల్లంగి తినడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. ముల్లంగి తీసుకుంటే.. రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. రాడిష్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్‌తో బాధ పడేవారు రాడిష్ తింటే.. డయాబెటీస్ కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
రక్త పోటు ఉన్నవారు కూడా ముల్లంగి తింటే మంచి ఫలితాలు ఉంటాయి. బీపీ అనేది కంట్రోల్ అవుతుంది. రక్త నాళాలను శాంత పరుస్తుంది. రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. దీంతో బీపీ అనేది కంట్రోల్ అవుతుంది. బీపీ కంట్రోల్‌గా ఉంటే.. గుండె సమస్యలు కూడా తగ్గుతాయి.
శరీరంలో ముఖ్యమైన భాగాల్లో కిడ్నీలు కూడా ఒకటి. ఇవి ఆరోగ్యంగా ఉంటేనే ఇతర పనులు చక్కగా జరుగుతాయి. ముల్లంగి తినడం వల్ల మూత్ర పిండాల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. మూత్ర పిండాల్లో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడేవారు రాడిష్ తినడం చాలా మంచిది. కాలేయం ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. కామెర్లు రాకుండా చేస్తుంది.
శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. వైరస్, బ్యాక్టీరియా, ఇన్ ఫెక్షన్‌ల బారిన పడకుండా చూస్తుంది. ముల్లంగిని ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా తక్కువగా జబ్బు పడతారు. క్యాన్సర్ కణాలను కూడా నశించేలా చేస్తుంది. ముల్లంగి తీసుకోవడం వల్ల బరువు కూడా కంట్రోల్‌గా ఉంటుంది. కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు కూడా తలెత్తవు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)