రోజూ ఈ జ్యూస్‌ తాగారంటే బంపర్‌ బెనిఫిట్స్‌.. చలికాలంలో తప్పనిసరి..!

బీట్‌రూట్‌ జ్యూస్‌ చర్మం నుండి గుండె ఆరోగ్యం వరకు ప్రతిదానికి ప్రయోజనకరంగా పనిచేస్తుంది. శీతాకాలంలో బీట్‌రూట్ సమృద్ధిగా లభిస్తుందిజ ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మీరు రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగితే మీ ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. బీట్‌రూట్‌ జ్యూస్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి పోషణ అందించడంలో, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.

రోజూ ఈ జ్యూస్‌ తాగారంటే బంపర్‌ బెనిఫిట్స్‌.. చలికాలంలో తప్పనిసరి..!
Beetroot Juice

Updated on: Nov 25, 2025 | 1:43 PM

బీట్‌రూట్‌లో బీటగిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది లివర్‌లో ఉన్న టాక్సిన్లను ఈజీగా తొలగించి, లివర్‌ను ఆరోగ్యంగా మారుస్తుంది. బీట్రూట్ జ్యూస్‌ తాగడం వల్ల బైల్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది, లివర్‌పై ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇందులో ఉండే బీటైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. బీట్‌రూట్‌ రసం తాగడం వల్ల ఫ్యాటీ లివర్‌ సమస్య రాదు. అంతేకాదు.. బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. బీట్‌రూట్‌ రసం తాగడం వల్ల కాలేయ కణాలు ఆరోగ్యంగా మారుతాయి. కాలేయ నష్టం తగ్గుతుంది.

బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల రక్తంలో పేరుకుపోయిన మలినాలు క్లీన్ అవుతుంది. బీట్‌రూట్ రసం తాగితే లివర్‌ క్లీన్ అవుతుంది. మలినాలు తొలగించబడతాయి. బీట్‌రూట్‌లో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బైల్ ఫ్లోను, రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. బీట్‌రూట్‌లో బీటాలైన్స్ ఉంటాయి. ఇవి కాలేయ వాపును కంట్రోల్ చేస్తాయి. బీట్‌రూట్ రసం తాగడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.

క్రమం తప్పకుండా బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. దీంతో ఫ్యాటీ లివర్‌ సమస్య తగ్గుతుంది. బీట్రూట్‌లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బీట్రూట్ రసం తాగితే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. రక్తహీనత తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us