
చలి పెరగడం, కాలుష్యం కోరలు చాచడంతో ప్రస్తుతం ప్రతి ఇంట్లో జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. ఇలాంటి సమయంలో ఇంగ్లీష్ మందుల కంటే మన వంటింట్లో లభించే దేశీ చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించిన వాము నీరు చలికాలపు అనారోగ్యాలకు రామబాణంలా పనిచేస్తుంది.
శ్వాసకోశ క్లీనర్: వాములోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శ్వాసనాళాల్లో పేరుకుపోయిన శ్లేష్మాన్ని కరిగించి, శ్వాస తీసుకోవడం సులభతరం చేస్తాయి.
జీర్ణక్రియకు ప్రాణం: ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు దూరమై జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
రోగనిరోధక శక్తి: ఆయుర్వేదం ప్రకారం వాము నీరు శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
వాము నీరు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి:
అతిగా వద్దు: వాము స్వభావం వేడి కాబట్టి అతిగా తాగితే కడుపులో మంట లేదా ఎసిడిటీ రావచ్చు. రోజుకు 1 లేదా 2 సార్లు మాత్రమే తీసుకోవడం ఉత్తమం.
గర్భిణీలు – పిల్లలు: గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలకు వాము నీరు ఇచ్చే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.
అసౌకర్యం కలిగితే: ఈ నీటిని తాగిన తర్వాత కడుపులో మంటగా అనిపిస్తే వెంటనే ఆపేయడం మంచిది.
ప్రకృతి ప్రసాదించిన ఈ సహజసిద్ధమైన నివారణను పాటిస్తూ చలికాలం వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..