రోజురోజుకీ వాహనాలు, పరిశ్రమలు పెరిగిపోవడం, ఇంధన వినియోగం ఎక్కు కావడం వల్ల వాయు కాలుష్యం భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. రోజురోజుకీ పెరుగుతోన్న వాయు కాలుష్యం కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే వాయు కాలుష్యం కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయని మనకు తెలుసు. కానీ వాయు కాలుష్యంతో మానసిక సమస్యలు కూడా తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పలు పరిశోధనలు నిర్వహించిన తర్వాత ఈ విషయాలను వెల్లడించారు. అధిక స్థాయి వాయు కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో నివసించే వ్యక్తుల్లో డిప్రెషన్, ఆందోళన, చిరాకు వంటి సమస్యలు రెండింతలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ఎక్కువ కాలం వాయు కాలుష్యానికి గురైతే.. ఒత్తిడి హార్మోన్లను పెంచుతుంది, ఇది ఆలోచనా సామర్థ్యం, జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నివేదికలో వెల్లడైంది. అలాగే వాయు కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో నివసించే వారిలో సైకోసిస్‌తో బాధపడే అవకాశం ఉన్నట్లు తేలింది.
వాయు కాలుష్యంతో పాటు ఎత్తైన భవనాల్లో నివసించడం, పెద్ద శబ్దాలకు గురికావడం వంటి అంశాలు కూడా ఈ సమస్యకు దారి తీస్తున్నాయిని చెబుతున్నారు. వాయు కాలుష్యానికి గురికావడం వల్ల ఇన్ఫ్లమేషన్ పెరగడం, న్యూరో డీజెనరేషన్ వంటి సమస్యలకు కారణమవుతుందని చెబుతున్నారు. కాలుష్యానికి గురైన వారిలో భావోద్వేగాలను నియంత్రించే మెదడులోని ప్రాంతాలలో మార్పులను అనుభవిస్తారని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నివేదిక చెబుతోంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..